ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీకి వెళ్లిన ఇంట్లోనే మందేసిన దొంగలు.. ఖరీదైన మద్యం బాటిళ్లు ఖాళీ చేసేశారు.. రూ.22 లక్షల విలువైన..

ABN, First Publish Date - 2022-06-26T21:15:50+05:30

రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇక చోరీల విషయానికొస్తే.. ప్రతి రోజూ ఎక్కడో చోట నగలు, నగదు మాయమయ్యాయనే వార్తలు వింటూనే ఉంటాం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇల్లును గుళ్ల చేసేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇక చోరీల విషయానికొస్తే.. ప్రతి రోజూ ఎక్కడో చోట నగలు, నగదు మాయమయ్యాయనే వార్తలు వింటూనే ఉంటాం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇల్లును గుళ్ల చేసేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. ముందుగా లోపల ఉన్న ఖరీదైన మద్యం బాటిళ్లను ఖాళీ చేసేశారు. తర్వాత మొత్తంగా రూ.22లక్షల విలువైన నగలు, నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని హదియాకు చెందిన సంజయ్ శ్రీవాస్తవ.. 2016 నుంచి తన కుటుంబంతో కలిసి వారణాసి సారనాథ్ ప్రాంతంలోని మావైయన్‌లోని అట్లాంటిక్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఇతను స్థానికంగా హేచరీ వ్యాపారం చేస్తుంటాడు. ఇదిలావుండగా, శుక్రవారం సంజయ్ తన కుటుంబంతో సహా బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే శనివారం అపార్ట్‌మెంట్ నుంచి అశోక్ యాదవ్ అనే వ్యక్తి సంజయ్‌కి ఫోన్ చేసి, మీ ఇంటి తలుపులు తెరచి ఉన్నాయని చెప్పాడు. దీంతో సంజయ్.. కంగారుగా అక్కడి నుంచి పరుగుపరుగున ఇంటికి చేరుకున్నాడు. లోపలికి వెళ్లి చూస్తే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.

చెరువులో ఈత కొడుతున్న కుర్రాళ్ల కాళ్లకు తగిలిందో మూట.. అనుమానంతో అందరూ కలిసి దాన్ని ఒడ్డుకు తెచ్చి చూస్తే..


ఇంట్లో ఉంచిన ఖరీదైన మద్యం బాటిళ్లు ఖాళీ అయ్యాయి. దొంగలు చోరీ చేసే ముందు ఫుల్‌గా మందు తాగినట్లు తెలిసింది. అలాగే అల్మారాలో ఉన్న రూ.18లక్షల నగదు, రెండు కిలోల వెండి నాణేలు, రూ.2లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అపార్ట్‌మెంట్‌లో రెండు రోజులుగా కరెంట్ లేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నగలు, నగదు సహా మొత్తం రూ.22లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. కరెంట్ లేకపోవడంతో దొంగలు చాలా సులువుగా లోపలికి ప్రవేశించారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగల కోసం గాలిస్తున్నారు.

నీ రూమ్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటా అనగానే ఫ్రెండ్‌కు తాళం ఇచ్చాడో వ్యక్తి.. రాత్రి వెళ్లి చూస్తే తెరచి ఉన్న తలుపులు.. లోపలకు వెళ్తే..

Updated Date - 2022-06-26T21:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising