నేటికీ అనేక రహస్యాలను దాచుకున్న ‘దొంగల బావి’
ABN, First Publish Date - 2022-12-20T09:43:41+05:30
హర్యానాలో విచిత్రమైన దొంగల బావి ఉంది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ మెట్ల బావిని రహస్య నిర్మాణంగా చెబుతుంటారు.
హర్యానాలో విచిత్రమైన దొంగల బావి ఉంది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ మెట్ల బావిని రహస్య నిర్మాణంగా చెబుతుంటారు. ఈ మెట్ల బావిని 1658-59 ADలో మొఘల్ రాజు షాజహాన్ సుబేదార్ సైదు కలాల్ నిర్మించారు. ఈ మెట్ల బావి లోపలికి వెళ్లాలంటే 101 మెట్లు దిగాలి. ఈ మెట్ల బావిలో ఒకప్పుడు గదులు కూడా ఉండేవి. ప్రస్తుతం, ఈ మెట్ల బావి శిథిలావస్థకు చేరుకుంది, కానీ దాని రహస్యాల గురించి తెలుసుకున్న పర్యాటకులు దానిని చూడటానికి వెళుతుంటారు. ఇక్కడి బావి నీరు ఇప్పుడు నల్లగా మారింది. ఒక దొంగకు సంబంధించిన కథ కూడా మెట్లబావితో ముడిపడి ఉంది. అందుకే దీనిని దొంగల బావి అని అంటారు. ప్రస్తుతం ఈ బాలిలోనికి ప్రవేశించడానికి అనుమతిలేదు.
ఎందుకంటే దాని సొరంగాలలో ఎవరైనా తప్పిపోవచ్చు! ఒక దొంగ ఈ మెట్లబావిలోకి దూకి అదృశ్యమయ్యాడని చెబుతారు. ఇతడు దోచుకున్న సొమ్మంతా ఈ మెట్టబావిలో ఉందని స్థానికులు చెబుతారు. అయితే చరిత్ర ఈ కథను ధృవీకరించలేదు. ఈ మెట్ల బావిలో ఇంతవరకు ఎవరికీ ఎలాంటి నిధి కనిపించలేదు. సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్లరు. చరిత్రలో కూడా దొంగ గురించిన సమాచారం దొరకలేదు. ఈ మెట్ల బావి గురించి వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి, ఒకప్పుడు కొందరు ఈ మెట్ల బావి మీదుగా ఊరేగింపుగా ఢిల్లీకి వెళ్లాలనుకున్నారని, అయితే వారు కనిపించకుండా పోయారని స్థానికులు చెబుతారు. తరువాతి కాలంలో ఈ మెట్లబావిని మూసివేశారు.
Updated Date - 2022-12-20T09:43:43+05:30 IST