ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఈ పనులను జీవితంలో త్వరగా పూర్తి చేయండి.. లేదంటే మృత్యువు సమీపించినప్పుడు పశ్చాత్తాప పడతారు!

ABN, First Publish Date - 2022-01-18T12:13:46+05:30

ఆచార్య చాణక్య రచించిన చాణక్య నీతిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య రచించిన చాణక్య నీతిలో మనిషి జీవితానికి సంబంధించిన పలు కీలక విషయాలు ఉన్నాయి. మనిషి తన జీవితంలో త్వరపడి చేయాల్సిన కొన్ని పనులు గురించి ఆచార్య చాణక్య తెలియజేశారు. అటువంటి పనులను చేయకపోతే మనిషి తన చివరి రోజుల్లో చింతించాల్సివుంటుందని పేర్కొన్నారు. చాణక్యనీతిలో తెలిపిన ఆ పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


సమాజ సేవ  

చాణక్య నీతి ప్రకారం ప్రతీ వ్యక్తి జీవితంలో కొంతవరకైనా సమాజానికి సేవ చేయాలి. చాలామంది వ్యక్తిగత పనులు, తన కుటుంబానికి సంబంధించిన పనులతో కాలం గడిపేస్తారు. ఈ ధ్యాసలో పడి సమాజ సేవ గురించి ఆలోచించరు. వృద్ధాప్య దశలో సామాజిక సేవ చేద్దామనుకుంటారు. అయితే మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండాలి. వీటి వలన ఈ జన్మలో గౌరవం లభించడమే కాకుండా రాబోయే జన్మకు మంచి పునాది పడుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. 

దానధర్మాలు

చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ధనవంతునిగా మారేవరకూ లేదా వృద్ధాప్యం వచ్చేవరకూ దానధర్మాలు చేద్దామని వేచిచూడకూడదు. ఉన్న ఆదాయంలోనే కొంతమేరకు దానధర్మాలకు వెచ్చించాలి. లేదంటే మరణ సమయంలో పశ్చాత్తాపానికి గురికావాల్సివస్తుంది. 

ఏ పనినీ వాయిదా వేయకండి

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనాసరే తాను చేయాల్సిన ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పనులను వాయిదావేస్తే అసంపూర్ణ ఫలితాలు పొందుతారు. అది అంత్యదశలో పశ్చాత్తాపానికి కారణమవుతుంది. 

Updated Date - 2022-01-18T12:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising