ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: మీకు మీరే సాటి కావాలనుకుంటున్నారా? అయితే ఈ విజయ సూత్రాలు మీకోసమే..

ABN, First Publish Date - 2022-02-14T12:19:08+05:30

ఆచార్య చాణక్య చెప్పిన జీవన సూత్రాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య చెప్పిన జీవన సూత్రాలు నేటి కాలానికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం... విజయం సాధించడం అంత తేలికైన పని కాదు. మీరు జీవితంలో విజయం సాధించాలంటే.. దానికోసం కృషితో పాటు కొన్నింటిని త్యాగం చేయాలి. అప్పుడు విజయం మాత్రమే మీ గమ్యస్థానం అవుతుంది. ఇంతేకాదు చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు. అయితే  విజయాన్ని పొందాలనే కాంక్ష కొద్దిమందికి మాత్రమే నెరవేరుతుంది. అయితే చాణక్యుడు తెలిపిన విజయ సూత్రాలను గుర్తుంచుకోవడం ద్వారా మనిషి విజయానికి చేరువవుతాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  

క్రమశిక్షణ

జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా మనం క్రమశిక్షణతో మెలగాలని చాణక్య నీతిలో ప్రధానంగా ప్రస్తావించారు. ఏ వ్యక్తి అయితే కఠినమైన క్రమశిక్షణను పాటిస్తాడో, సమయానికున్న విలువను తెలుసుకుంటాడో.. అతనిలో పనులను సకాలంలో పూర్తి చేయగల శక్తి అభివృద్ధి చెందుతుంది. అప్పుడు విజయం సాధ్యం అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు. 


విషయ పరిజ్ఞానం

చాణక్య నీతి ప్రకారం, విజయం సాధించడంలో విషయ పరిజ్ఞానం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విషయ పరిజ్ఞానంలో బలహీనంగా ఉన్న వ్యక్తి విజయం సాధించలేడు. అటువంటి వారు చాలా కష్టపడవలసి వస్తుంది. అయితే విషయ పరిజ్ఞానాన్ని పొందడానికి నిరంతరం సిద్ధంగా ఉన్నవారు విజయాన్ని తేలికగా అందుకుంటారు. అలాంటి వారికి కూడా శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుంది.

విశేషమైన కృషి

విజయంలో కృషికి విశేషమైన ప్రాధాన్యత ఉందని చాణక్య నీతిలో పేర్కొన్నారు. శ్రమ లేకుండా విజయం సాధ్యం కాదు. కష్టపడి పనిచేయడానికి భయపడే వారికి విజయానందం దక్కదు. ఎందుకంటే విజయ సాధనకు కష్టించి పనిచేయడం తప్ప మరో మార్గం లేదు. దీనిని గ్రహించి.. కష్టపడి పని చేస్తూ ముందుకు సాగండి.  బద్ధకాన్ని విడిచిపెట్టి కృషితో ముందడుగు వేస్తే.. ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-02-14T12:19:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising