ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: మీరు ఈ బాధలను ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అయితే మీ సమస్యలు రెట్టింపవుతాయి!

ABN, First Publish Date - 2022-02-20T11:48:24+05:30

అర్థనాసం మనస్తపం గృహే దుశ్చరితాని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'అర్థనాసం మనస్తపం గృహే దుశ్చరితాని చ, వంచనం చాప్మానం చ మతిమమాన్ ప్రకాశయేత్' అనే శ్లోకం ద్వారా ఆచార్య చాణక్య.. జీవితంలో విలువైన విషయాలను తెలిపారు. సంపద కోల్పోయినప్పుడు, మనస్సులో దుఃఖం ఏర్పడినప్పుడు, భార్య ప్రవర్తన సరిగా లేదని తెలిసినప్పుడు, నీచమైన వ్యక్తి నుంచి చెడు విషయాలు విన్నప్పుడు... ఈ సంగతులను ఎవరితోనూ చర్చించవద్దు. ఈ శ్లోకం అర్థాన్ని వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బు మనిషికి నిజమైన బలం అని ఆచార్య తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మీరు సంపద నష్ట పోయినప్పుడు దాని గురించి ఎవరికీ చెప్పకండి. 


ఇది తెలిసిన తర్వాత, మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా సహాయం చేయడానికి ముందుకురారు. మీ మనస్సు దు:ఖంతో నిండిపోయినప్పుడు అందుకు కారణమైన విషయాన్ని ఎవరితోనూ ఎప్పుడూ చర్చించకండి. మీ చుట్టూవున్నవారు మీ బాధను తెలుసుకున్న తర్వాత, మీ ముఖంపై వారి ఓదార్పును వ్యక్తం చేస్తారు. తరువాత మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. మీ భార్య ప్రవర్తన చెడ్డది అయితే దాని గురించి ఎవరితోనూ మాట్లాడకండి. మీ మనసులోనే ఉంచుకోండి. దీని గురించి ఎవరితోనైనా చర్చిస్తే.. సమాజంలో మీరు తల ఎత్తుకుని తిరగడం కష్టమవుతుంది. మీరు ఎక్కడైనా ఏదో ఒక కారణంగా అవమానానికి గురైతే, ఆ విషయాన్ని ఎవరి దగ్గరా ప్రస్తావించకండి.  దీనిని ఇతరులతో చర్చించడం వల్ల వారు మీపై చిన్నచూపు చూస్తారని ఆచార్య చాణక్య తెలిపారు.

Updated Date - 2022-02-20T11:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising