ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: వైవాహిక జీవితంలో కలహాలకు దారితీసే అలవాట్లివే... ఆదమరిస్తే తీవ్ర నష్టం!

ABN, First Publish Date - 2022-03-14T12:34:28+05:30

ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త. వ్యూహకర్త. ఆచార్య మనకు నీతి సూత్రాలను అందించారు. అందులో.. సంపద, ఆస్తి, స్త్రీలు, స్నేహితులు, వృత్తి, వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలను లోతుగా ప్రస్తావించారు. చాణక్య.. తన విధానాలతో సమాజానికి మార్గదర్శకంగా నిలిచారు. ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలను అనుసరించే వ్యక్తి తన జీవితంలో గొప్ప పురోగతిని సాధిస్తాడని నిపుణులు చెబుతారు. భార్యాభర్తలు తమకు ఎదురయ్యే ప్రతి సుఖంలోను, దుఃఖంలోను ఒకరికొకరు అండగావుంటే వారి బంధం మరింత దృఢంగా ఉంటుందని చాణక్య తన నీతి శాస్త్రంలో రాశారు.  అయితే మనిషిలోని కొన్ని అలవాట్లు  వైవాహిక జీవితంలో విభేదాలను కలిగిస్తాయని చాణక్య తెలిపారు. ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్య నీతి ప్రకారం కోపం అనేది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.


ఎవరైనా సరే కోపంగా ఉన్నప్పుడు మంచి, చెడులను అర్థం చేసుకోలేరు. అదే సమయంలో కోపంతో ఉన్న వ్యక్తి ఎదుటనున్నవారికి హాని కలిగిస్తాడు. వైవాహిక జీవితంలో భాగస్వాముల కోపం అనేక కలహాలకు దారితీస్తుంది. భార్యాభర్తలు నిగ్రహాన్ని కోల్పోతారు. ఫలితంగా వారు గొడవ పడతారు. అందుకే దంపతులు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏ రిలేషన్‌లో అయినా మోసం అనేది చేరితే ఆ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది.  వైవాహిక జీవితం అనేది నమ్మకంపై ఆధారపడివుంటుంది. ఒకసారి నమ్మకం అనేది కోల్పోతే ఆ సంబంధం శాశ్వతంగా తెగిపోయేందుకు అవకాశాలుంటాయి. అందుకే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు నిజాయితీగా మెలగాలి. భార్యాభర్తలు తమ మధ్య దాపరికాలు లేకుండా మెలగాలి. చెడు,మంచి విషయాలను పరస్పరం పంచుకోవాలి. మనసులో ఏదీ దాచుకోకూడదు. అప్పుడే వారి బంధం మరింత ధృడపడుతుంది. శక్తి లేకుండా శివుడు అసంపూర్ణుడని చెబుతారు. అదేవిధంగా భార్యాభర్తలు ఒకరికి ఒకరు అన్నట్టుగా లేకపోతే అసంపూర్ణంగా మిగులుతారు.  పరస్పర గౌరవం లేని సంబంధాలు తొందరగా విచ్ఛిన్నమవుతాయి. అందుకే వైవాహిక జీవితంలో ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం.



Updated Date - 2022-03-14T12:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising