ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: యవ్వన ప్రాయంలో ఈ 5 తప్పులు చేశారంటే ఇక వారి జీవితమంతా ముళ్లబాటే..

ABN, First Publish Date - 2022-01-08T12:05:19+05:30

భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందాలంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందాలంటే, యవ్వనంలో ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు ఉన్నతంగా మలచుకోవాలి. మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు అతనిలో ఉత్సాహం, బలం ధైర్యం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటే తన జీవితాన్ని సంరక్షించుకున్నవాడవుతాడు. అలాకాదని యవ్వన ప్రాయాన్ని చెడు అలవాట్లతో దుర్వినియోగం చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం మనిషి వయసులో ఉన్నప్పుడు ఏమేమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


వయసులో ఉన్నపుడు మనిషిలో శక్తియుక్తులు ఉంటాయి. అటువంటప్పుడు బద్దకాన్ని అలవరచుకుంటే జీవితంలో అమూల్యమైన సమయాన్ని కోల్పోతారు. సామర్థ్యాలను దుర్వినియోగం చేసుకున్నవారవుతారు. బద్ధకం అనేది ఎవరికైనాసరే పెద్ద శత్రువులాంటిది.  చేపట్టే ఏ పని అయినా పూర్తి అంకితభావం, చిత్తశుద్ధితో చేయాలి. నిర్లక్ష్యం లాంటి పదాలు మన నిఘంటువులో ఉండకూడదు. అజాగ్రత్తగా ఉంటే దానిఫలితం జీవితాంతం భరించాల్సి వస్తుంది. వ్యసనం  అనేది ఏ వ్యక్తి జీవితాన్నయినా నాశనం చేస్తుంది. ఇది మీ డబ్బును దుర్వినియోగం చేస్తుంది. మీ శారీరక, మానసిక సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. యుక్తవయస్సులో చేసే చెడు స్నేహాలు జీవితాన్ని పక్కదారి పట్టిస్తాయి. అందుకే యవ్వనప్రాయంలోవున్న వ్యక్తి స్నేహితుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు దారిలో నడిచేవారు మిమ్మల్ని కూడా అదే దారిలోకి తీసుకెళతారు. మీ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేస్తారు. మితిమీరిన లైంగిక వాంఛలు కూడా యువత జీవితాన్ని నాశనం చేస్తాయి. ఈ అవలక్షణం కారణంగా శరీరం అనారోగ్యం పాలవుతుంది. మనసులో చెడు ఆలోచనలు తాండవిస్తాయి. తనపై తాను నియంత్రణ కోల్పోతాడు. అందుకే యువత వయసులో ఉన్నప్పుడు మంచి లక్షణాలను అలవరచుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు.

Updated Date - 2022-01-08T12:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising