ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఇలా ప్రవర్తించేవారికి త్వరలోనే అధోగతి... అప్రమత్తంగా మెలగడం ఉత్తముల లక్షణం!

ABN, First Publish Date - 2022-02-27T12:01:20+05:30

ఆచార్య చాణక్యుని విధానాలు, ఆలోచనలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్యుని విధానాలు, ఆలోచనలు కఠినంగా అనిపించవచ్చు. కానీ అవి జీవిత సత్యాలను చాటుతాయి. జీవితంలో ఎదురయ్యే పరీక్షా సమయాల్లో తప్పక సహాయపడతాయి. ఆచార్య చాణక్యుని ఆలోచనా విధానాల్లోని ఒక ఉత్తమ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రవర్తన సరిగాలేని వ్యక్తుల భవిష్యత్ గురించి ఆచార్య చాణక్య తెలిపారు. అటువంటి వారు త్వరలోనే నాశనమవుతారని పేర్కొన్నారు.  

అసన్తుష్టా ద్విజా నిష్టాః సన్తుష్టశ్చ మహీభృతా ।

సలజ్జ గణిక నిష్టా నిర్లజ్జశ్చ కులాంగనా

అసంతృప్తులైన బ్రాహ్మణులు, తృప్తి చెందిన రాజులు, నిర్లజ్జగా ప్రవర్తించే గృహిణులు త్వరలోనే అధోగతిపాలవుతారు. ఈ శ్లోకం ద్వారా ఆచార్య చాణక్య.. మనిషి ప్రవర్తన అతనిని ఎలా అధోగతిపాలు చేస్తుందో తెలియజెప్పాడు. 



అసంతృప్తితో ఉండే బ్రాహ్మణుడు

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణుడు తన జ్ఞానంతో మాత్రమే సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు. గ్రంథాలలోని జ్ఞానంతో మాత్రమే జనానికి ఉపకారం చేయగలడు. బ్రాహ్మణులను వారి యోగ్యతను అనుసరించి అందరూ గౌరవిస్తారు. అయితే ఎవరైనా బ్రాహ్మణుడు ఎదుటివారు ఇచ్చే దానంతో సంతృప్తి చెందకుండా, అంతకన్నా ఎక్కువగా ఆశిస్తే అతను ఈరోజు కాకపోయినా ఎఫ్పుడైనా అధోగతి పాలవుతాడు. 

తృప్తి చెందిన రాజు

రాజు ఎప్పుడూ సంతృప్తి చెందకూడదు. ఎందుకంటే రాజు తృప్తి చెందితే, రాబోయే కాలంలో అతను తన రాజ్యాన్ని విస్తరించలేడు. ప్రజలను సరిగ్గా చూసుకోలేడు. ఫలితంగా రాబోయే కాలంలో ఆ రాజ్య వినాశనం ఖచ్చితంగా జరుగుతుంది.

నిర్లజ్జగా ప్రవర్తించే గృహిణి

గృహిణిని సాధారణంగా గృహలక్ష్మిగా భావిస్తారు. కుటుంబం గౌరవాన్ని ఆమె కాపాడుతుంది. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం గృహిణి  నిర్లజ్జగా వ్యవహరిస్తే, కుటుంబం నుంచే ఆమెకు వ్యతిరేకత మొదలవుతుంది. ఫలితంగా ఆ కుటుంబమంతా భవిష్యత్‌లో ధన నష్టం, వ్యాపారంలో నష్టంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.   

Updated Date - 2022-02-27T12:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising