ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని..

ABN, First Publish Date - 2022-08-19T02:35:08+05:30

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులమతాలు (Caste religions) వేరైనా కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే వివాహం చేసుకుని సంతోషంగా ఉండేవారు. అయితే...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులమతాలు (Caste religions) వేరైనా కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే వివాహం చేసుకుని సంతోషంగా  ఉండేవారు. అయితే 16సంవత్సరాల తర్వాత వారి కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. ఆరు నెలల క్రితం ఉన్నట్టుండి భర్త అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య సమస్యలు తలెత్తాయి. ఇటీవల ఓ రోజు చెల్లెలు ఇంటికి వెళ్తున్నానని చెప్పి.. చివరకు భార్య ఏం చేసిందంటే..


హర్యానా (Haryana) రాష్ట్రం అంబాలా జిల్లా కాంట్‌లోని తారా నగర్‌లో నివాసం ఉంటున్న ముస్లిం వ్యక్తి.. 16ఏళ్ల క్రితం యూపీలోని బిజ్నోర్ జిల్లా మన్సూర్ సరాయ్ సయోహరాకు చెందిన హిందూ యువతిని ప్రేమించి పెళ్లి (love marriage) చేసుకున్నాడు. కులమతాలు వేరైనా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదిలావుండగా, ఆరు నెలల క్రితం భర్త సడన్‌గా అస్వస్థతకు (Illness) గురయ్యాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 9న.. భార్య తన చెల్లెలి ఇంటికి వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే తర్వాత విచారిస్తే.. ఆమె అక్కడికి వెళ్లలేదు.

అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..


దీంతో కంగారు పడిన భర్త.. తెలిసిన వారి వద్ద విచారించాడు. అయినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తాను ముస్లిం అయినా.. తన భార్యకు ఎప్పుడూ బురఖా ధరించడం వంటి నిబంధనలు (Terms) విధించలేదని చెప్పాడు. ఐదు నెలల క్రితం కూడా తనకు చెప్పకుండా వెళ్లిన భార్య.. కొన్నాళ్లకు తిరిగి వచ్చిందన్నాడు. తల్లి ఎక్కడికి వెళ్లిందంటూ పిల్లలు అడుగుతుంటే.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదని.. భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ కోసం గాలిస్తున్నారు.

గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..



Updated Date - 2022-08-19T02:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising