ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని పక్కింటోళ్లు అంటున్నా లేదని బుకాయించిందా భార్య.. పోలీసుల ఎంట్రీతో..

ABN, First Publish Date - 2022-03-05T00:31:59+05:30

కర్ణాటకలో తాజాగా ఓ అనుమానాస్పద మృతి కేసు సంచలనం కలిగిస్తోంది. భర్త మృతదేహంతో భార్య మూడు రోజులుగా ఇంట్లోనే గడిపింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని కేసుల్లో చిక్కుముడి వీడేందుకు చాలా సమయం పట్టొచ్చు. కొన్నిసార్లు ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావు. ఇలాంటి పెండింగ్ కేసుల గురించి గతంలో చాలా సార్లు విన్నాం. కొన్ని కేసులైతే చిన్న క్లూతో పరిష్కారం అవుతుంటాయి. ఎంత తెలివైన నేరస్థుడైనా ఎక్కడో చోట తనకు తెలీకుండా చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పే చివరకు నిందితుడిని పోలీసులకు పట్టిస్తుంది. కర్ణాటకలో తాజాగా ఓ అనుమానాస్పద మృతి కేసు సంచలనం కలిగిస్తోంది. ఓ ఇంటి నుంచి మూడు రోజుల నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో పక్కింటోళ్లు అక్కడికి వెళ్లి ‘‘ మీ ఇంట్లోంచి దుర్వాసన వస్తోంది’’.. అంటూ భార్యను అడిగారు. అలాంటిదేమీ లేదే అంటూ ఆమె బుకాయించింది. అయితే ఆమెపై అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ పరిధి ధార్వాడలోని ఎత్తినగుడ్డ నివాసి మంజునాథ అబ్బిగెరె(30)కు తొమ్మిదేళ్ల క్రితం ఓ యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవనగర ఎల్‌ఐజీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇన్నేళ్లు సవ్యంగా సాగిన వీరి సంసారంలో అనూహ్యంగా అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. తాజాగా గురువారం వారి ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడాన్ని పక్కింటి వాళ్లు గమనించారు. వారింటి వద్దకు వెళ్లి ‘‘ మీ ఇంట్లోంచి దుర్వాసన వస్తోంది’’.. అంటూ భార్యను అడిగారు. ‘‘అలాంటిది ఏం లేదు’’.. అంటూ భార్య తడబడుతూ సమాధానం ఇచ్చింది. దీంతో స్థానికులకు ఆమెపై అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

‘‘నీకో బహుమతి ఇస్తా, ఊరిబయటకు వచ్చెయ్’’.. అంటూ ప్రియురాలిని పిలిచిన యువకుడు.. మాట్లాడుతూ మాట్లాడుతూ..


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు తీయించి లోపలికి వెళ్లారు. అక్కడ మంజునాథ మృతదేహం ఉండడాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త చనిపోయి మూడు రోజులవుతున్నా.. ఎందుకు చెప్పలేదంటూ పోలీసులు ఆమెను ప్రశ్నించారు. అయితే దీనిపై ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.  తమ కొడుకు మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయని మంజునాథ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

‘‘వరుసగా అన్ని సార్లు ఎవరు ఫోన్ చేస్తున్నారు’’.. అని అడిగిన ప్రియుడు.. చివరకు ఆమె చెప్పిన సమాధానం విని..

Updated Date - 2022-03-05T00:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising