ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ పాముకు కూడా కొబ్బరి బోండాలు కావాలేమో.. ఎలా ఎక్కుతోందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-01-23T00:37:54+05:30

సోషల్ మీడియాలో ఓ పాము వీడియో తెగ వైరల్ అవుతోంది. కొబ్బరిచెట్టు పైకి చుట్టలు చుట్టుకుంటూ ఎగబాకే పామును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొబ్బరి బొండం కోసం పాము ఎంత తహతహలాడుతుందో అన్నట్లుగా ఈ వీడియో ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. గ్రాఫిక్స్ మాయాజాలమేమో అని అనిపిస్తుంటుంది. ఇటీవల పలు జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూశాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పాము వీడియో తెగ వైరల్ అవుతోంది. కొబ్బరిచెట్టు పైకి చుట్టలు చుట్టుకుంటూ ఎగబాకే పామును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొబ్బరి బొండం కోసం పాము ఎంత తహతహలాడుతుందో అన్నట్లుగా ఈ వీడియో ఉంది.


బీహార్ ముజఫర్‌నగర్ పరిధి మాధేపురా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు పేరుతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కొబ్బరి చెట్టుపైకి పాము విచిత్రంగా ఎగబాకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎంతో చాకచక్యంగా పాము చెట్టు పైకి వెళ్లడం చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ఆనోటా, ఈనోటా ఈ సమాచారం అందరికీ తెలియడంతో ప్రజలంతా అక్కడ గుమికూడారు. చెట్టుకు పెనువేసుకుని, రింగులు రింగులు తిరుగుతూ చెట్టు పైకి వెళ్లడం వీడియోలో చూడొచ్చు. అయితే కోకోనట్డె వలప్‌మెంట్ బోర్డు అధికారులు మాత్రం తమ పరిధిలో ఇలాంటి పాము చూడలేదని, ఇది తమ ప్రాంతానికి సంబంధించినది కాదని చెబుతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. కొబ్బరి బొండాలంటే ఈ పాముకు చాలా ఇష్టం ఉన్నట్టుంది.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

పాముతోనే నీరు తాగించాడు.. ఇతను మామూలు వ్యక్తి కాదు.. చూస్తే అవాక్కవుతారు..



Updated Date - 2022-01-23T00:37:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising