ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి మండపంలోకి వరుడి ఎంట్రీ మామూలుగా లేదుగా.. విపరీతమైన మంచులో ఎలా వెళ్లాడంటే..

ABN, First Publish Date - 2022-01-28T02:04:00+05:30

హిమాచల్ ప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడకకు సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ వైపు ముహూర్తానికి సమయం దగ్గరపడుతుంటే.. మరోవైపు మంచు విపరీతంగా కురుస్తోంది. ఎలాగైనా మండపానికి చేరుకోవాలనే ఉద్దేశంతో వరుడు వినూత్నంగా ఎంట్రీ ఇచ్చాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లిలో జరిగే ప్రతి ఘటనా.. జీవితాంతం ఒక మధుర ఘట్టంగా మిగిలిపోతుంది. అందుకే చాలా మంది తమ వివాహ వేడుక కలకాలం గుర్తుండేలా వినూత్నంగా నిర్వహిస్తూ ఉంటారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయాక.. వినూత్నంగా ఉండే పెళ్లి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడకకు సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ వైపు ముహూర్తానికి సమయం దగ్గరపడుతుంటే.. మరోవైపు మంచు విపరీతంగా కురుస్తోంది. ఎలాగైనా మండపానికి చేరుకోవాలనే ఉద్దేశంతో వరుడు వినూత్నంగా ఎంట్రీ ఇచ్చాడు.


హిమాచల్‌‌ప్రదేశ్‌‌లో చలి, మంచు ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాంటి మంచు ప్రాంతంలో ఓ జంట వివాహ వేడుక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.  అసలే చలికాలం కావడంతో హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కడ చూసినా మోకాలు లోతు మంచు పేరుకుపోయింది. అదే సమయంలో ఓ వరుడు పెళ్లి మండపానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ సాధ్యం కాకపోవడంతో ఎలాగైనా వెళ్లాలనే ఉద్దేశంతో వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా జేసీబీని బుక్ చేసుకుని, అందులో ముందుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అక్కడ పెళ్లి కార్యక్రమాన్ని ముగించుకుని, మళ్లీ అదే జేసీబీలో భార్యను ఎక్కించుకుని ఇంటికి వెళ్లాడు. వరుడు అనూహ్యంగా జేసీబీలో రావడంతో.. వావ్! ఏం ఎంట్రీ అంటూ స్థానికులతో పాటూ సోషల్ మీడియోలో వీడియో చూసిన నెజిటన్లు కూడా తెగ పొగుడుతున్నారు.

పేరుకు పెళ్లి కారు.. లోపల ఆడవాళ్లను ఎక్కించి.. వారు చేసిన పని తెలిస్తే అవాక్కవుతారు





Updated Date - 2022-01-28T02:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising