ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ నక్కకు సంగీతం తెగ నచ్చినట్లుందే.. బుద్ధిగా వింటూ ఎలా పరవశిస్తోందో చూడండి..

ABN, First Publish Date - 2022-02-18T02:14:36+05:30

ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆండీథార్న్ అనే వ్యక్తి నిర్మానుష్య ప్రదేశంలో బాంజో వాయిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ నక్క అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీతంతో ఎన్నో రోగాలు నయమవుతాయనే విషయం తెలిసిందే. మనసు సరిగ్గాలేని సమయంలో మంచి సంగీతం వినడం వల్ల హృదయానికి ఎంతో సాంత్వన కలుగుతుంది. సంగీతానికి మనుషులే కాకుండా పక్షులు, పశువులూ స్పందిస్తాయనే విషయం పలు సందర్భాల్లో ఋజువైంది కూడా. తాజాగా ఓ వీడియో ఇందుకు సాక్షంగా నిలుస్తోంది. సంగీతానికి ఓ నక్క ఎలా స్పందించిందో చూస్తే అంతా ఆశ్చర్యపోతారు.


జంతువులకు సంబంధించిన వీడియోలను చాలా చూస్తూ ఉంటాం. ప్రస్తుతం చూడబోయే వీడియో మరింత ఆసక్తికరంగా ఉంటుంది. సంగీతానికి నేను కూడా పరవశిస్తానంటూ ఓ నక్క తన అభిరుచిని మనకు తెలియజేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆండీథార్న్ అనే వ్యక్తి నిర్మానుష్య ప్రదేశంలో బాంజో వాయిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ నక్క అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తుంది.

బాబా ఆశ్రమంలో యువతికి రోజుల తరబడి శాంతి పూజలు.. చివరకు ఓ రోజు బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా..


మనుషులను చూస్తే ఆమడదూరం పారిపోయే నక్క... ఇతడి వద్దకు వచ్చి బుద్ధిగా ఎదురుగా కూర్చుంటుంది. సంగీతానికి మైమరిచిపోయినట్లుగా అక్కడే కదలకుండా ఉండిపోతుంది. దీన్ని గమనించిన ఆ వ్యక్తి కూడా మరింత శ్రద్ధగా సంగీతాన్ని వినిపిస్తాడు. అతడి చుట్టూ చక్కర్లు కొట్టిన నక్క.. చివరకు మళ్లీ ఎదురుగా నిల్చుని సంగీతం వింటూ ఉండడం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఈ దొంగ అందరిలా కాదు.. ఆరు రోజుల్లో లక్షల రూపాయల విలువైన చోరీ.. చివరికి ఏమైందంటే..





Updated Date - 2022-02-18T02:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising