ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యజమాని కోసం ఎదురుచూసి, ఎదురు చూసి.. చివరకు ఈ కుక్క ఏం చేసిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-04-10T18:49:25+05:30

మనుషులపై కుక్కలకు ఉన్న విశ్వాసం.. మరే జంతువులకు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కసారి వాటిని ఆదరిస్తే.. తమ ప్రాణం ఉన్నంత వరకూ యజమాని ఇంటిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుషులపై కుక్కలకు ఉన్న విశ్వాసం.. మరే జంతువులకు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కసారి వాటిని ఆదరిస్తే.. తమ ప్రాణం ఉన్నంత వరకూ యజమాని ఇంటిని కాపలా కాస్తుంటాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కుక్కలను పెంచుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. కొందరైతే వివిధ జాతులకు చెందిన కుక్కలను కొనేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడరు. కొన్ని కుక్కలకు అమితమైన తెలివితేటలు ఉంటాయి. మరికొన్ని కుక్కలు తమ యజమానులపై ఎనలేని ప్రేమను పెంచుకుంటుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ కుక్క తన యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే యజమాని ఎంతసేపటికీ రాకపోవడంతో ఆ కుక్క చేసిన పని.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ఓ ఇంట్లోని పెంపుడు కుక్క తన యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే తన యజమాని ఎంతసేపటికీ రాడు. దీంతో సోపా పక్కకు వెళ్లి, తన యజమాని షూని నోట కరుచుకుని వస్తుంది. సోపా పైకి ఎక్కి షూని పక్కనే పెట్టుకుని, దాని మీద తల పెట్టుకుని పడుకుంటుంది. తన యజమాని రాక కోసం ఎంత తపిస్తోందో.. ఈ ఒక్క సన్నివేశంతో ఎవరికైనా అర్థమవుతుంది. ఆ కుక్క బాధను చూసి నెటిజన్లు కూడా చలించిపోతున్నారు. మనుషులపై మనుషులకే లేని ప్రేమ, అభిమానాలు.. జంతువుల్లో చూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. 2020లో పోస్టు చేసిన ఈ వీడియో.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి..

వివాహ వేడుకలో వరుడి పక్కనే కూర్చున్న వ్యక్తి.. దొంగచాటుగా ఇంత పని చేశాడేంటీ..





Updated Date - 2022-04-10T18:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising