ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వావ్! ఈ కుక్క పియానో ఎంత బాగా వాయిస్తుందో.. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..

ABN, First Publish Date - 2022-03-18T03:10:22+05:30

శిక్షణ తీసుకున్న కుక్కలు.. చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్ని కుక్కలు వివిధ కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తుంటే.. మరికొన్ని తమ తమ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిక్షణ తీసుకున్న కుక్కలు.. చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్ని కుక్కలు వివిధ కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తుంటే.. మరికొన్ని తమ తమ యజమానుల సేవకు జీవితం అంకితం చేస్తుంటాయి. వివిధ జాతులకు చెందిన కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం రోజూ చూస్తూనే ఉంటాం. కొన్ని కుక్కలు మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి కుక్కలను చూస్తే.. అరె! మనుషుల మాదిరే ఎంత చక్కగా చేస్తున్నాయి.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలోని కుక్కను చూసినా అలాంటి ఆశ్చర్యమే కలుగుతుంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఒక కుక్క పియానో వాయించడం మనం చూడొచ్చు. ఖరీదైన ఇంట్లో పియానో ఏర్పాటు చేసి ఉండగా... యజమాని కెమెరా స్టార్ట్ చేయగానే సదరు కుక్క పియానో వద్దకు వచ్చి.. తన సంగీత ప్రావిణ్యాన్ని చూపించడం మొదలుపెడుతుంది. తన ముందు కాళ్లను పియానోపై ఉంచి వాయించడం స్టార్ట్ చేస్తుంది. ఏదో వాయిస్తున్నానంటే వాయిస్తున్నాను అన్నట్లు కాకుండా.. అందులో లీనమై ప్లే చేస్తుంది. మధ్య మధ్యలో గొంతు సవరించి పాడుతున్నట్లు.. దాని హావభావాలు ఉంటాయి. పియానో వాయించడంలో ఎంతో అనుభవం ఉన్న మనుషుల్లాగే.. ఈ కుక్క కూడా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియోపై నెజిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఈ ఆవు స్వతహాగా తల తిప్పినా.. కారు డ్రైవర్‌కు కరెక్ట్‌గా సెట్ అయింది.. కావాలంటే మీరే చూడండి..





Updated Date - 2022-03-18T03:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising