ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ వీడియోను చూసి ఇతడిలా చేయాలని మాత్రం అస్సలు ప్రయత్నించకండి.. బైక్‌పై వెళ్తుండగానే..

ABN, First Publish Date - 2022-05-28T22:15:36+05:30

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇంకొందరు యువకులైతే డేంజరస్ స్టంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇంకొందరు యువకులైతే డేంజరస్ స్టంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇక బైకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బైకు రేసులు చేస్తూ కొందరు, ప్రమాదకర విన్యాసాలు చేస్తూ మరికొందరు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇటీవల ముంబైలో ఒకే బైకులో ఆరుగురు యువకులు ఒకరి బుజాలపై మరొకరి కూర్చుని వెళ్లిన వీడియో వైరల్ అయిన విషయం తెలసిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. బైకుపై చేసిన విన్యాసానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..


ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి బైకుపై చేసిన విన్యాసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి బైక్‌పై వస్తుండగా మరో బైక్‌పై కొందరు వీడియో తీస్తూ ఉంటారు. కొంచెం దూరం మామూలుగా వచ్చిన ఆ వ్యక్తి.. సడన్‌గా బైకుపై బోర్లా పడుకుంటాడు. అలాగే కొంచెం దూరం  బైకు నడుపుతూ వెళ్తాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియో నోయిడా పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీంతో ఈ ఘటనపై విచారణ చేసి, సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను ఎవరూ అనుకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. నెటిజన్లు కూడా దీనిపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

షాకింగ్ వీడియో: ఎలుగు బంటిని చూడగానే ఆనందంతో దాని వైపే పరుగులు తీసిన చిన్న పాప.. చివరకు..





Updated Date - 2022-05-28T22:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising