ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎలుకపైకి పాము దాడి చేయడం మామూలే.. అదే ఎలుకే పాము మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా...

ABN, First Publish Date - 2022-01-29T02:43:10+05:30

ఎలుక, పాము.. ఈ రెండింటిలో ఏది పవర్‌ఫుల్ అని అడిగితే.. ఇందేం పిచ్చి ప్రశ్న అని అంటాం. ఎలుకలపైకి పాము దాడి చేయడం సాధారణమే కాబట్టి.. పామే పవర్‌ఫుల్ అని టక్కున చెబుతాం. అదే పాము మీదకు ఎలుక దాడి చేయడం కలలో కూడా ఊహించం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలుక, పాము.. ఈ రెండింటిలో ఏది పవర్‌ఫుల్ అని అడిగితే.. ఇందేం పిచ్చి ప్రశ్న అని అంటాం. ఎలుకలపైకి పాము దాడి చేయడం సాధారణమే కాబట్టి.. పామే పవర్‌ఫుల్ అని టక్కున చెబుతాం. అదే పాము మీదకు ఎలుక దాడి చేయడం కలలో కూడా ఊహించం. అలాంటిది నిజంగా జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అసాధ్యం అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. కింద ఉన్న వీడియో చూస్తే.. మీరే ముక్కన వేలేసుకుంటారు. పామును పరుగులు పెట్టించిన ఎలుకను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


పిల్లలను కాపాడుకోవడానికి మనుషుల మాదిరే జంతువులు కూడా ఎంతకైనా తెగిస్తాయి. తమ పిల్లల జోలికి వస్తే.. అవతల ఉన్నది సాధు జంతువా, క్రూర జంతువా అని కూడా చూడవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాము పిల్ల ఎలుకను పట్టుకుంటుంది. ఇక దానికి ఆహారమవుతుందనుకునే క్రమంలో తల్లి ఎలుక ఎంటరవుతుంది. పామును చూసి పరుగెత్తాల్సిన ఆ ఎలుక.. అందుకు విరుద్ధంగా ఏమాత్రం జంకకుండా పాముపై అమాంతం దాడి చేస్తుంది. తన పిల్లను వదిలే వరకూ పామును వదలదు. ఈ పోటీలో ఓడిపోయిన పాము.. ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా పిల్ల ఎలుకను వదిలేసి.. పొదల్లోకి జారుకుంటుంది. దీన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇదేం ఫీట్‌రా నాయనా! అలా దూకేశావు.. చూస్తుంటేనే భయమేస్తోంది..





Updated Date - 2022-01-29T02:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising