ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెయ్యం వదిలిస్తానని ఇంట్లోకి ప్రవేశించాడు.. పెద్ద కూతురిని గదిలోకి తీసుకెళ్లి తల్లిదండ్రుల ముందే..

ABN, First Publish Date - 2022-03-22T16:06:24+05:30

అతని పేరు రాజీవ్ కుమార్.. తాను దేవుడినని అతను అందరికీ చెప్పుకుంటాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతని పేరు రాజీవ్ కుమార్.. తాను దేవుడినని అతను అందరికీ చెప్పుకుంటాడు.. ఇంట్లో ఉన్న దెయ్యాలను వదిలిస్తానని, పూజలు చేసి సౌభాగ్యవంతులను చేస్తానని నమ్మించాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రాజీవ్‌కు భూత వైద్యుడిగా పేరు ఉంది. భూత వైద్యం పేరుతో ఇతను చేసే చేష్టలను గ్రామస్థులు భరిస్తూ వచ్చారు. ఐదో తరగతి కూడా పాస్ కాని రాజీవ్ భూత వైద్యం పేరుతో ఎంతో డబ్బు సంపాదించాడు. అంతేకాదు.. తనను నమ్మిన వారి ఇంట్లో.. వారి ఎదురుగానే ఆ ఇంటి కోడలిపై లేదా పెద్ద కూతురిపై అత్యాచారానికి పాల్పడతాడు. 


అజ్మీర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కుటుంబం భూత వైద్యం కోసం ఇటీవల రాజీవ్‌ను ఆశ్రయించింది. వారి ఆహ్వానం మేరకు రాజీవ్ వారి ఇంటికి వెళ్లాడు. బెడ్రూమ్‌లో పూజకు ఏర్పాట్లు చేశాడు. ఆ ఇంటి పెద్ద కూతురిని గదిలోకి పంపించమని అడిగాడు. ఆ బాలిక చేత గట్టిగా మంత్రాలు చదివిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా చేస్తేనే పట్టిన దెయ్యం వదులుతుందని చెప్పాడు. అలాగే ఓ గ్రామానికి చెందిన వ్యక్తి రాజీవ్‌కు రూ.10 లక్షలు ఇచ్చి తన ముగ్గురు కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా ఇంట్లో పూజలు చేయమని అడిగాడు. 


ఇక, మరో ఇంట్లో కూడా అలాగే పూజలు చేసి ఆ ఇంటి పెద్ద కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 22 ఏళ్ల బాధితురాలు ఈ నెల 19వ తేదీన ఆదర్శ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఇతరులు కూడా రాజీవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు రాజీవ్‌ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-03-22T16:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising