ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంధ మహిళపై అత్యాచారం.. చివరకు నిందితుడు ఎలా దొరికాడంటే..

ABN, First Publish Date - 2022-03-12T20:12:08+05:30

ఆమె ఒక అంధురాలు.. అయినా పట్టుదలగా చదువు పూర్తి చేసి బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె ఒక అంధురాలు.. అయినా పట్టుదలగా చదువు పూర్తి చేసి బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది.. రెండేళ్ల క్రితం ఆమె ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఇంట్లోని విలువైన వస్తువులు కాజేసి పారిపోయాడు.. ఆమె అంధారులు కావడంతో అతడిని చూడలేకపోయింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 9 రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.. ఆ కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తాజాగా కోర్టు తీర్పు నిచ్చింది. 


మధ్యప్రదేశ్‌తలోని భోపాల్‌లో ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న అంధ మహిళ ఇంట్లో ఏప్రిల్ 16, 2020న ఓ దొంగ చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంట్లోని విలువైన వస్తువులు కాజేశాడు. తర్వాతి రోజు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దొంగకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లూ చెప్పలేకపోయింది. 9 రోజుల తర్వాత బాధిత యువతి మొబైల్‌ను అమ్ముతూ నిందితుడు దొరికిపోయాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మరికొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 


బాధిత యువతి నిందితుడి గొంతును గుర్తు పట్టింది. అతడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని స్టేట్‌మెంట్ ఇచ్చింది. కేసు పెట్టిన పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టారు. దాదాపు రెండేళ్ల విచారణ అనంతరం ఈ కేసులో జిల్లా కోర్టు తీర్పునిస్తూ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 

Updated Date - 2022-03-12T20:12:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising