ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అంతా చూస్తుండగా.. చిన్నారిని ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి నెట్టేసింది.. చివరికి ఏమైందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-02-03T02:05:32+05:30

ఉజ్బెకిస్తాన్‌ తాష్కెంట్ జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. సందర్శకులతో ఆ జూ మొత్తం సందడి సందడిగా ఉంది. మరోవైపు చిన్నపిల్లలంతా జంతువులను ఆసక్తిగా చూస్తున్నారు. ఓ ఎలుగుబంటి ఎన్‌క్లోజర్ వద్ద జనం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. చిన్నారుల మనసు తెలుసుకుని వారి పట్ల ప్రేమతో వ్యవహరించాలి. కానీ ప్రస్తుత సమాజంలో పిల్లల పట్ల ప్రేమ చూపడం పక్కన పెడితే.. వారిని హింసిస్తూ పైశాసిక ఆనందం పొందే శాడిస్టులను ఇటీవల చాలా మందిని చూశాం. కన్న తల్లిదండ్రులు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడడం బాధాకరం. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో చిన్నారిని స్వయానా కన్నతల్లే.. ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి నెట్టేసింది.


ఉజ్బెకిస్తాన్‌ తాష్కెంట్ జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. సందర్శకులతో ఆ జూ మొత్తం సందడి సందడిగా ఉంది. మరోవైపు చిన్నపిల్లలంతా జంతువులను ఆసక్తిగా చూస్తున్నారు. ఓ ఎలుగుబంటి ఎన్‌క్లోజర్ వద్ద జనం గుమికూడి ఉన్నారు. ఈ క్రమంలో అంతా చూస్తుండగా ఓ మహిళ తన మూడేళ్ల కూతురిని ఎన్‌క్లోజర్‌లోకి పడేసింది. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఎలుగుబంటి.. చిన్నారిని చూడగానే దాడి చేసేందుకు వేగంగా తన వద్దకు వెళ్లింది. అనూహ్య ఘటనతో పైనున్న జనం మొత్తం షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లి చిన్నారిని రక్షించారు. 16అడుగుల ఎత్తు నుంచి కింద పడడంతో పాపకు గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చిన్నారి తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏనుగు పాలు తాగుతూ, ఆటలాడుతున్న చిన్నారి.. జాగ్రత్త పాపా అంటూ సలహాలిస్తున్న నెటిజన్లు..





Updated Date - 2022-02-03T02:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising