ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినిమా సీన్‌ను తలపిస్తున్న ఘటన.. పట్టపగలే షాపింగ్‌ మాల్‌లోకి దూసుకొచ్చిన కారు.. చివరకు..

ABN, First Publish Date - 2022-05-30T01:44:34+05:30

ఒక్కోసారి కలలో కూడా ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కోసారి కలలో కూడా ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ షాపింగ్ మాల్‌లో కస్టమర్లు సరుకులు కొనే పనిలో ఉన్నారు. అయితే వారు ఊహించని విధంగా ఉన్నట్టుండి ఓ కారు లోపలికి దూసుకొచ్చింది. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.


అమెరికా టెంపే నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కస్టమర్లతో షాపింగ్ మాల్ రద్దీగా ఉంది. అంతా ఎవరికి కావాల్సిన వస్తువులు వారు కొనే పనిలో ఉన్నారు. ప్రవేశ మార్గం వద్ద ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఓ కారు ఒక్కసారిగా అద్దాలు పగులగొట్టుకుంటూ వచ్చింది. క్షణాల్లో అక్కడున్న ఇద్దరు ఉద్యోగులను ఢీకొట్టి.. అలాగే లోపలికి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతా తేరుకునేలోపే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఇద్దరు ఉద్యోగులు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వేదిక పైకి పెళ్లికూతురు గ్రాండ్‌ ఎంట్రీ.. అమ్మాయి అంటే ఇలా ఉండాలి..!





Updated Date - 2022-05-30T01:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising