ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా పెళ్లైన యువకుడు.. భార్య పక్కనుండగానే మరో యువతితో కాలక్షేపం.. అది చూసి ఈ నవవధువు ఏం చేసిందో చూడండి!

ABN, First Publish Date - 2022-04-16T16:24:00+05:30

అతడికి పెళ్లై సరిగ్గా 24 గంటలు గడిచిందో లేదో.. భార్య పక్కనే ఉన్నా ఆమెను పట్టించుకోవడం మానేశాడు. మరో యువతిపై దృష్టి పెట్టాడు. నవవధువు పిలుస్తున్నా వినిపించుకోకుండా.. యువతికి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయసాగాడు. దీంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడికి పెళ్లై సరిగ్గా 24 గంటలు గడిచిందో లేదో.. భార్య పక్కనే ఉన్నా ఆమెను పట్టించుకోవడం మానేశాడు. మరో యువతిపై దృష్టి పెట్టాడు. నవవధువు పిలుస్తున్నా వినిపించుకోకుండా.. యువతికి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయసాగాడు. దీంతో ఆ నవవధువు సహనాన్ని కోల్పోయింది. భర్తపై విరుచుకుపడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆ జంటకు  అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అనంతరం గ్రాండ్‌గా రిసెప్షెన్ ఏర్పాటు చేశారు. వధూవరులు ఇద్దరూ అందంగా తయారై వేదికపైకి చేరుకున్నారు. ఇంతలో అక్కడి ఓ యువతి వచ్చింది. వరుడి పక్కన కూర్చుని అతడికి కబుర్లు చెప్పడం ప్రారంభించింది. దీంతో ముచ్చట్లో పడి ఆ యువకుడు తన భార్యనే మరిచిపోయాడు. ఆమె పిలుస్తున్నా పట్టించుకోకుండా యువతితో కబుర్లలో లీనం అయిపోయింది. ఈ క్రమంలో నవవధువుకు చిర్రెత్తుకొచ్చింది. అందరూ చూస్తుండగానే వరుడి నెత్తిపై చేతితో ఒక్కటిచ్చింది. దెబ్బకు గురుడు దారిలోకొచ్చాడు. గమ్మున వధువు పక్కకొచ్చి కూర్చున్నాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-04-16T16:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising