ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడియో కాల్ చేసిన యువతి.. మాట్లాడుతూ ఆమె చేసిన పనికి షాక్.. కొద్దిసేపటికి పోలీసులు ఫోన్ చేసి..!

ABN, First Publish Date - 2022-04-15T17:50:18+05:30

అతను ఓ ప్రాపర్టీ డీలర్.. ఇటీవల అతనికి తెలియని నెంబర్ నుంచి ఓ వీడియో కాల్ వచ్చింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఓ ప్రాపర్టీ డీలర్.. ఇటీవల అతనికి తెలియని నెంబర్ నుంచి ఓ వీడియో కాల్ వచ్చింది.. ఓ యువతి అతనితో మాట్లాడింది.. కొద్దిసేపటి తర్వాత ఆమె మాట్లాడుతూనే తన బట్టలు విప్పేసి పూర్తి నగ్నంగా మారిపోయింది.. షాకైన ప్రాపర్టీ డీలర్ వెంటనే కాల్ కట్ చేశాడు.. కొద్దిసేపటి తర్వాత పోలీసుల నుంచి కాల్ వచ్చింది.. ఓ యువతి న్యూడ్ వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినందుకు కేసు నమోదైనట్టు చెప్పారు. మరికొద్దిసేపటికి ఓ యువకుడు ఫోన్ చేసి రూ.15 వేలు ఇస్తే ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేస్తానని చెప్పాడు. దీంతో ప్రాపర్టీ డీలర్ పోలీసులను ఆశ్రయించాడు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన భూపేంద్ర సింగ్ అనే వ్యక్తి ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం వాట్సాప్ ద్వారా అతనికి వీడియో కాల్ వచ్చింది. తన పేరు రోషిణి అని చెబుతూ ఓ యువతి మాట్లాడింది. అలా మాట్లాడుతూ తన బట్టలన్నీ విప్పేసి నగ్నంగా మారిపోయింది. షాకైన భూపేంద్ర ఆ వీడియో కాల్‌ను కట్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి పోలీసుల నుంచి కాల్ వచ్చింది. రోషిణి అనే యువతి న్యూడ్ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్టు ఫిర్యాదు వచ్చిందని, ఆమె ఆత్యహత్యాయత్నం చేసిందని చెప్పడంతో భూపేంద్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. 


అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత మరో యువకుడు భూపేంద్రకు ఫోన్ చేశాడు. రూ.15 వేలు ఇస్తే రోషిణి న్యూడ్ వీడియోను  యూట్యూబ్‌ నుంచి తొలగిస్తానని చెప్పాడు. ఇదంతా ఓ ట్రాప్ అని భూపేంద్రకు అర్థమైంది. వెంటనే ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 

Updated Date - 2022-04-15T17:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising