ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medical negligence: మహిళ తలలో బయటపడిన కండోమ్ ప్యాకెట్.. కట్లు విప్పిన డాక్టర్లు షాక్.. చివరకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-08-22T02:09:24+05:30

వైద్యుల నిర్లక్ష్యం.. ఒక్కోసారి రోగుల కొంప ముంచుతుంటుంది. సమస్యతో ఆస్పత్రికి వచ్చిన రోగికి.. నయం కాకపోగా మరిన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ప్రాణాపాయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యుల నిర్లక్ష్యం.. ఒక్కోసారి రోగుల కొంప ముంచుతుంటుంది. సమస్యతో ఆస్పత్రికి వచ్చిన రోగికి.. నయం కాకపోగా మరిన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ప్రాణాపాయం సంభవించిన సందర్భాలను కూడా చాలా చూశాం. కొన్నిసార్లు ఆపరేషన్లు (Operations) చేసే సమయంలో ఇనుప వస్తువులను కడుపులో పెట్టి కుట్లు వేసిన వైద్యులను కూడా చూశాం. మధ్యప్రదేశ్‌లో ఇటీవల విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మహిళ తలకు కట్టు విప్పిన డాక్టర్లకు షాకింగ్ దృశ్యం కనిపించింది. తలలో కండోమ్ ప్యాకెట్ (Condom packets) బయటపడడంతో అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) మోరెనా జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మాఘర్‌కు చెందిన రేష్మాబాయి అనే మహిళ తలకు గాయమైంది. దీంతో చికిత్స నిమిత్తం మొరెనాలోని పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు (Community Health Center) వచ్చింది. ప్రాథమిక పరీక్ష నిమిత్తం ఆమె తలకు కట్టు కట్టారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. తలకు కట్టు కట్టే సమయంలో దెబ్బ తగిలిన ప్రాంతంలో కాటన్ క్లాత్‌ను పెట్టాల్సింది పోయి.. కండోమ్ ప్యాకెట్‌ను ఉంచి కట్టు కట్టాడు. అనంతరం మోరెనా జిల్లా ఆస్పత్రికి (District Hospital) రెఫర్ చేశాడు. అక్కడికి వెళ్లిన మహిళను పరీక్షించిన వైద్యులు ఖంగుతిన్నారు. కట్లు విప్పే సమయంలో కండోమ్ ప్యాకెట్ బయటపడడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరకు ఈ విషయం ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీంతో విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Shocking scene: కారులో వెళ్తున్న మహిళా కానిస్టేబుల్.. పొదల్లోంచి అలికిడి రావడంతో.. దగ్గరికి వెళ్లి చూడగా..



Updated Date - 2022-08-22T02:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising