ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయిందా..? చంపేశారా..? మిస్టరీగా మారిన మహిళ సజీవ దహనం కేసు.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో..

ABN, First Publish Date - 2022-07-22T23:39:16+05:30

ముందు ఆత్మహత్య అనుకున్న కేసుల్లో చివరకు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు హత్యలు చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తుంటారు. దీంతో అనుమానాస్పద...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముందు ఆత్మహత్య అనుకున్న కేసుల్లో చివరకు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు హత్యలు చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తుంటారు. దీంతో అనుమానాస్పద కేసుల్లో అసలు నిందితులను గుర్తించేందుకు పోలీసులు వివిధ రకాలుగా దర్యాప్తు చేస్తుంటారు. బీహార్‌లో ఇలాంటి అనుమానాస్పద కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ సజీవ దహనం కేసు మిస్టరీగా మారింది. తెల్లవారుజాము 3గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం నలంద జిల్లా హిల్సా పరిధిలోని బలభద్రసరాయ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామధర్ శర్మ అనే వ్యక్తికి భార్య మాల్తీ దేవి(35), ఓ కుమారుడు ఉన్నారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఉపాధి నిమిత్తం రామధర్ శర్మ.. కొడుకుతో సహా వేరే రాష్ట్రంలో కూలి పనులు చేసుకుంటున్నారు. గ్రామంలో మాల్తీ దేవి ఒక్కటే నివాసం ఉంటోంది. ఇటీవల ఓ రోజు వేకువజామున 3గంటల సమయంలో వీరి ఇంటి నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. గమనించిన ఇంటి పక్కల వారు కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల వారంతా గుమికూడారు. మంటలు అదుపు చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు.

నేరుగా స్టేషన్‌కు వచ్చి.. వెక్కి వెక్కి ఏడుస్తూ 15 ఏళ్ల బాలిక చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఇంటికి వెళ్లి చూస్తే..


అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఇల్లు మొత్తం బూడిదైంది. మహిళ కోసం అంతా వెతికినా కనిపించలేదు. చివరకు ఇంట్లో శిథిలాలను తొలగిస్తుండగా..  కాసేపటి లోపల సగం కాలిన మృత దేహం బయటపడింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త, కుమారుడికి సమాచారం అందించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది, దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక్క రోజు సెలవు ఇవ్వలేదనే కారణంతో.. లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ.. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే..



Updated Date - 2022-07-22T23:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising