ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకా తెల్లారకముందే ఇంట్లో అలికిడి.. అత్త నిద్రలేచి చూస్తే గదిలో కొత్త కోడలు మిస్సింగ్.. జరిగింది తెలిసి భర్తకు మైండ్ బ్లాక్..!

ABN, First Publish Date - 2022-05-18T17:46:04+05:30

పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వీరి ఆటలు సాగుతున్నాయి. 32 పెళ్లిళ్లు చేసుకుని 33వ పెళ్లికి సిద్ధమవుతున్న మహిళను రాజస్థాన్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌లోని గయలో కూడా ఇలాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన ఏడు రోజుల తర్వాత కొత్త పెళ్లి కూతురు బంగారం, డబ్బుతో మాయమైంది. దీంతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. 

ఇది కూడా చదవండి

ఆమెకు 32 ఏళ్ల వయసు.. ఇప్పటికే 32 పెళ్లిళ్లు.. మరో పెళ్లికి సిద్ధమైంది కానీ ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్..!



చకంద్ స్టేషన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఉదయ్ కుమార్‌‌కు గయకు చెందిన పింటు కుమారితో ఈ నెల 9న వివాహం జరిగింది. వివాహం తర్వాత వధూవరులిద్దరూ చకంద్‌కు వెళ్లి.. మే 11న రిసెప్షన్‌‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత కోడలు 15వ తేదీన అత్తమామల ఇంటికి వెళ్లింది. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ తమ గదుల్లో నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఏదో శబ్దం రావడంతో ఇంట్లోని ఓ సభ్యుడు లేచాడు. ఇంటి మెయిన్ గేటు తెరిచి ఉండడం చూసి మిగతా వారిని లేపాడు. 


నూతన దంపతుల తలుపులు కూడా తెరిచి ఉండడంతో అందరూ లోపలికి వెళ్లి చూశారు. అక్కడ ఉదయ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతడిని లేపి కొత్త పెళ్లి కూతురి గురించి అడగ్గా తనకేమీ తెలియదన్నాడు. ఆమె గురించి ఊరంతా వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరకు బీరువాలో 4.5 లక్షల విలువైన నగలు, 50 వేల రూపాయలు పోయినట్టు తెలుసుకుని ఉదయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-05-18T17:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising