ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం.. 90 ఏళ్ల వృద్ధురాలు మృతి.. పూడ్చిపెట్టిన మూడో రోజే మళ్లీ బయటకు తీయించిన గ్రామస్తులు.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-07-02T20:43:54+05:30

90 ఏళ్ల వృద్ధురాలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్మశాన వాటికలో పాతిపెట్టారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

90 ఏళ్ల వృద్ధురాలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్మశాన వాటికలో పాతిపెట్టారు.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ కుటుంబ సభ్యులను బెదిరించారు.. వెంటనే మృతదేహాన్ని వెలికి తీసి వేరే స్థలంలో ఖననం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు.. ఆ ఇంటికి దారి మూసేస్తామని, నీళ్లు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు జేసీబీతో మృతదేహాన్ని బయటకు తీసి తమ సొంత పొలంలో పాతిపెట్టారు. రాజస్థాన్‌లొరి బార్మర్‌లోని సదర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: బ్రష్ చేయకుండా ముద్దు వద్దన్న భార్య.. ఆ భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..


రామ్‌సర్ కువా గ్రామ పంచాయతీకి చెందిన అనాసి దేవి (90) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించింది. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని గ్రామంలోని ప్రభుత్వ దహనవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. అయితే అనాసి దేవి ఆ గ్రామానికి చెందిన మహిళ కాదు. వేరే గ్రామానికి చెందిన మహిళ. ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడే రామ్‌సర్ గ్రామానికి వచ్చి డ్రమ్స్ వాయించేది. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ఆమె డ్రమ్స్ వాయించాల్సిందే. దీంతో ఆ గ్రామానికి సమీపంలో పొలం కొనుక్కుని స్థిరపడింది. 


బతికి ఉన్నప్పుడు ఆమె సేవలను వాడుకున్న గ్రామస్థులు చనిపోయాక అమానవీయంగా ప్రవర్తించారు. ఆమె మృతదేహాన్ని తమ ఊరి స్మశానంలో పాతిపెట్టినందుకు ఆ కుటుంబ సభ్యులను బెదిరించారు. దీంతో ఆమె మనవడు బార్మర్ తహసీల్దార్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అయితే తహసీల్దార్ ఈ ఘటనపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. 

Updated Date - 2022-07-02T20:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising