ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నీళ్లల్లో పడిపోయిన కుక్క పిల్ల.. గమనించిన మరో కుక్క ఎలా కాపాడిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-01-29T03:21:43+05:30

కుక్క అంటేనే విశ్వాసం.. విశ్వాసం అంటేనే కుక్క. పిడికెడు అన్నం పెడితే జీవితాంతం ఇంటికి కాపలా కాస్తాయి కాబట్టే.. వాటికి అంత పేరు వచ్చింది. మనుషులపైనే అంత విశ్వాసం చూపించే కుక్కలు.. ఇక సాటి కుక్కలపై ఇంకెంత చూపించాలి. అందులోనూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుక్క అంటేనే విశ్వాసం.. విశ్వాసం అంటేనే కుక్క. పిడికెడు అన్నం పెడితే జీవితాంతం ఇంటికి కాపలా కాస్తాయి కాబట్టే.. వాటికి అంత పేరు వచ్చింది. మనుషులపైనే అంత విశ్వాసం చూపించే కుక్కలు.. ఇక సాటి కుక్కలపై ఇంకెంత చూపించాలి. అందులోనూ కుక్క పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకుంటాయా అంటే.. అస్సలు ఊరుకోవనే చెప్పాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో నీళ్లల్లో పడిన ఓ పిల్ల కుక్కను.. పెద్ద కుక్క గమనిస్తుంది. దాని దగ్గరికి వెళ్లి.. ఎలాంటి గాయాలూ కాకుండా చాలా సునాయాసంగా బయటికి తీస్తుంది.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. స్విమ్మింగ్‌పూల్ వద్ద  తెల్లటి కుక్క పిల్ల అటూ, ఇటూ పరుగెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో పొరపాటున కాలు జారి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోతుంది. అతి కష్టం మీద ఈతకొడుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇంతలో దాన్ని పెద్ద కుక్క గమనిస్తుంది. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే దాని వద్దకు వెళ్తుంది. కాపాడే క్రమంలో మొదట తడపడినా.. పట్టు వదలకుండా మళ్లీ మరో చోటికి వెళ్లి ప్రయత్నిస్తుంది. చివరగా నోటితో కుక్క పిల్లను పట్టుకుని, ఎలాంటి గాయాలూ కాకుండా సునాయాసంగా బయటకు తీస్తుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మనుషుల మధ్య లేని అనురాగం, ఆప్యాయతలు.. జంతువుల్లో ఉన్నాయంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఎలుకపైకి పాము దాడి చేయడం మామూలే.. అదే ఎలుకే పాము మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా...





Updated Date - 2022-01-29T03:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising