ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video : పుట్టీ పుట్టక ముందే నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న పిల్ల డాల్ఫిన్..

ABN, First Publish Date - 2022-08-24T16:17:51+05:30

అమ్మ కావడమనేది ఓ వరం.. అది మనిషి అయినా.. సృష్టిలో ఏ ప్రాణి అయినా.. ఇక పురుటి నొప్పులు కూడా కామనే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మ కావడమనేది ఓ వరం.. అది మనిషి అయినా.. సృష్టిలో ఏ ప్రాణి అయినా.. ఇక పురుటి నొప్పులు కూడా కామనే. పురుటి నొప్పులు(Delivery Pains) భరించి బిడ్డకు జన్మనివ్వడమంటే.. తల్లి మరో జన్మ ఎత్తడమే. జీవి పుట్టుక అంటే తల్లి తనతో తాను చేసే ఒక హోరాహోరీ యుద్ధం.  అయినా సరే బిడ్డ పుట్టిన వెంటనే ఆ బాధంతటినీ మరిచి పోతుంది తల్లి. ఏ జీవుల్లో అయినా తల్లి బిడ్డల అనుబంధం సమ్ థింగ్ స్పెషల్(Some thing special). మానవ జన్మలో ఉన్నాం కాబట్టి మన తల్లితో ఉన్న ఎమోషన్ మనకి తెలుస్తాయి. కానీ ఇతర జీవులలో తల్లి బిడ్డల ఎమోషన్ అంతగా తెలియదు. కానీ జీవం పుట్టుక మాత్రం ఎక్కడైనా సేమ్.


తాజాగా ఓ డాల్ఫిన్ డెలివరీ(Dolphin Delivery)కి సంబంధించిన విజువల్ సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది. సముద్రం(Sea)లో డాల్ఫిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నిజానికి డాల్ఫిన్స్‌ని డైరెక్టుగా చూసిన వారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటిది డాల్ఫిన్ డెలివరీనా? ఛాన్సే లేదు. అసలు అవి పిల్లలని ఎలా కంటాయన్న దానిపై కూడా ఎవరికీ పెద్దగా క్లారిటీ లేదు. అయితే తాజాగా ఓ కెమెరామెన్ డాల్ఫిన్ డెలివరీకి సంబందించిన విజువల్‌ని తన కెమెరాలో బంధించారు. ఈ వీడియోలో ట్విట్టర్‌(Twitter)లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. 


సముద్ర గర్భంలో ఓ తల్లి డాల్ఫిన్ అలా ఈదుకుంటూ వెళ్లి సడెన్ గా తన పిల్ల డాల్ఫిన్‌ని బయటకి రిలీజ్ చేస్తుంది. ఇక పిల్ల డాల్ఫిన్ కూడా పుట్టిన వెంటనే లేగదూడ మాదిరిగా క్షణం కూడా ఆలస్యం లేకుండా తల్లితో సమానంగా ఈదడం మొదలు పెట్టింది. ఇక ఆ పిల్ల డాల్ఫిన్ తల్లి దగ్గరకి చేరిపోయి దాని చుట్టూ తిరుగుతూ కనిపించింది. ఈ ఆసక్తికర వీడియో నెటిజన్ల(Netizens)ను తెగ ఆకట్టుకుంటోంది. ఏకంగా దాదాపు 3.5 మిలియన్స్ మంది వీక్షించగా.. దాదాపు లక్ష మంది లైక్ చేశారు. 



Updated Date - 2022-08-24T16:17:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising