ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Terrible Tradition: ఇప్పటికీ అక్కడ ఈ సంప్రదాయం.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. మహిళ కాలి వేళ్లు కత్తిరించి వాటిని..

ABN, First Publish Date - 2022-08-21T14:39:27+05:30

శాస్త్రసాంకేతిక రంగం ఎంతో అభివృద్ది చెందింది. ఈ క్రమంలోనే ప్రజలు అంతరిక్షయానానికి కూడా సిద్ధం అవుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ గుడ్డిగా దురాచారాలను పాటిస్తూనే ఉన్నారు. సంప్రదాయం ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా దా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: శాస్త్రసాంకేతిక రంగం ఎంతో అభివృద్ది చెందింది. ఈ క్రమంలోనే ప్రజలు అంతరిక్షయానానికి కూడా సిద్ధం అవుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ గుడ్డిగా దురాచారాలను పాటిస్తూనే ఉన్నారు. సంప్రదాయం ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకు ఇండోనేషియాలో జరుగుతున్న ఘటనలే నిదర్శనం. ఇండోనేషియాకు చెందిన కొందరు ప్రజలు.. చేస్తున్న పనులు తెలిస్తే కోపం రాక మానదు. 


వెస్ట్రన్ న్యూ గినియా(western New Guinea).. ఇండోనేషియా(Indonesia)కు చెందిన ఐలాండ్ ఇది. ఇక్కడే కొన్నేళ్లుగా ఓ దురాచారం అమలులో ఉంది. కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. బాధిత కుటుంబ సభ్యుల్లోని మహిళ కాలి వేళ్ల ముందు భాగాలను గొడ్డలితో నరికే(part of the fingers is cut off with an axe) దారుణమైన సంప్రదాయాన్ని దని ట్రైబల్ జాతి(Dani tribal community)కి చెందిన ప్రజలు పాటిస్తున్నారు. వేళ్లను నరికడానికి ముందు రక్తస్రావం ఎక్కువగా జరగకుండా ఉండేందుకు.. వాటిని గుడ్డ ముక్కలతో గట్టిగా కట్టి రక్త ప్రసరణ ఆగిపోయేలా చేస్తారు. అనంతరం వేళ్లను నరికి.. వాటిని మంటల్లో కాలుస్తారు. తర్వాత ఆ బూడిదను సేకరించి.. ఓ ప్రాంతంలో భద్రపరుస్తూ ఉంటారు. 



ఈ విషయం అక్కడి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఈ దురాచారంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రజలు మాత్రం.. ఈ సంప్రదాయాన్ని ఇంకా గుట్టుగా కొనసాగిస్తూనే ఉన్నారు. అందువల్లే అక్కడి చాలా మంది ఆడవాళ్ల కాళ్లకు వేళ్లు ఉండవు. వెస్ట్రన్ న్యూ గినియాలో దని ట్రైబల్ జాతికి చెందిన ప్రజల సంఖ్య 25లక్షల వరకూ ఉంటుంది. 


Updated Date - 2022-08-21T14:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising