ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురికి త్వరగా పెళ్లి జరిగేలా పూజలు చేయమంటే.. తల్లీ, కూతుళ్లకు నీళ్లిచ్చిన నకిలీ బాబా.. మరుక్షణమే..

ABN, First Publish Date - 2022-02-25T23:03:59+05:30

మహారాష్ట్రలో ఇటీవల ఓ నకిలీ బాబా ఉదంతం వెలుగులోకి వచ్చింది. కూతురికి త్వరగా పెళ్లి జరిగేలా పూజలు చేయించేందుకు ఓ మహిళ నకిలీ బాబాను సంప్రదించింది. వీరి బలహీనతను అవకాశంగా తీసుకున్న...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాషాయం కట్టుకుని, కమండలం పట్టుకుంటే చాలు.. సంఘంలో వారికి ఎక్కడా లేనంత గౌరవం వచ్చిపడుతోంది. తాము కనిపించే దేవుళ్లలా ప్రచారం చేసుకుంటున్న ఎంతో మంది నకిలీ బాబాల గుట్టు చివరకు రట్టు అయిన విషయం తెలిసిందే. బాబాల పేరుతో కోట్లకు కోట్లు డబ్బు సంపాదించడం.. బాలికలు, యువతులు, మహిళలను మోసం చేసే నకిలీ బాబాల గురించి తరచూ వింటూనే ఉన్నాం. అయినా వారి దగ్గరకు క్యూ కట్టే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది కానీ ఏమాత్రం తగ్గడం లేదు. వివిధ సమస్యలతో సతమతమయ్యే వారు.. కష్టాల నుంచి గట్టెంకేందుకు చివరకు మూఢనమ్మకాలను విశ్వసించి, మరిన్ని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలో ఇటీవల ఓ నకిలీ బాబా ఉదంతం వెలుగులోకి వచ్చింది. కూతురికి త్వరగా పెళ్లి జరిగేలా పూజలు చేయించేందుకు ఓ మహిళ నకిలీ బాబాను సంప్రదించింది. వీరి బలహీనతను అవకాశంగా తీసుకున్న ఆ బాబా చివరకు ఏం చేశాడంటే..


మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కూతురికి త్వరగా పెళ్లి అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా అవి ఫలించలేదు. చివరకు దోష నివారణ పూజలు చేయించాలని నిర్ణయించుకుంది. సన్నిహితులను విచారించి, యోలా తాలూకాలోని నాగ్డే గ్రామంలోని బాబా వద్దకు వెళ్లింది. తన కుమార్తెకు త్వరగా పెళ్లి జరిగేలా పూజలు చేయాలని వేడుకుంది. వీరి బలహీనతను గమనించిన ఆ నకిలీ బాబా..‘‘ మీ కుమార్తెపై ఎవరో చేతబడి చేశారు.. ఇద్దరూ ఈ జలం తాగితే అంతా మంచే జరుగుతుంది’’.. అంటూ వారికి నీటిని అందించాడు. ఆ నీటిని తాగిన కొద్దిసేపటికే తల్లీకూతుళ్లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారితో పాటూ మరికొంత మంది యువతులకు కూడా ఇలాగే నీటిని తాగించారు.

కాబోయే భర్తకు స్నేహితురాలితో కలిసి పరీక్ష పెట్టిన యువతి.. చివరకు భర్త చేసిన పనేంటో తెలుసుకుని ఖంగుతింది..


అపస్మారక స్థితిలో ఉన్న అందరినీ సదరు నకిలీ బాబా ఓ గదిలోకి తీసుకెళ్లి.. తన సోదరుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తంతును మొత్తం వీడియో తీయించాడు. మెలకువలోకి వచ్చిన వారు.. జరిగిన విషయం తెలుసుకుని నకిలీ బాబాను నిలదీశారు. దీంతో వారికి వీడియోలను చూపించి, ఎవరికైనా చెబితే మొత్తం బయటపెడతానంటూ బెదిరించాడు. ఇలా రెండేళ్లుగా వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల వారి నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేయడం మొదలెట్టాడు. నకిలీ బాబా వేధింపులు ఎక్కువవడంతో విసిగిపోయి.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ బాబా ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది.

నీ భార్య ఉరి వేసుకుందంటూ ఇంటి యజమాని ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండి.. నేనొచ్చేస్తానన్న భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

Updated Date - 2022-02-25T23:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising