ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.6 లక్షల కారును కొన్న వ్యక్తి.. బిల్లును చెల్లించమంటే అన్నీ రూ.10 కాయిన్స్ మూటలు ఇవ్వడంతో అంతా షాక్..

ABN, First Publish Date - 2022-06-20T23:36:41+05:30

స్థానికంగా ఓ పాఠశాలను నడుపుతున్న ఓ యువకుడు.. కారు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కార్ల షోరూమ్ వెళ్లాడు. అక్కడ ఓ కారును చూసి ముచ్చటపడ్డాడు. దీంతో షోరూమ్ సిబ్బంది.. ఆ కారు ధర రూ.6లక్షలు అని అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: స్థానికంగా ఓ పాఠశాలను నడుపుతున్న ఓ యువకుడు.. కారు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కార్ల షోరూమ్ వెళ్లాడు. అక్కడ ఓ కారును చూసి ముచ్చటపడ్డాడు. దీంతో షోరూమ్ సిబ్బంది.. ఆ కారు ధర రూ.6లక్షలని అతడికి తెలియజేశారు. ఈ క్రమంలో యువకుడు ఆ మొత్తాన్ని రూ.10 నాణేలా రూపంలో చెల్లిస్తానడంతో సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు. అయితే.. తొలుత  కాయిన్స్ రూపంలో డబ్బులు తీసుకునేందుకు నిరాకరించిన సిబ్బంది.. అతడి ఉద్దేశాన్ని తెలుసుకుని అంగీకరించారు. కాగా.. స్థానికంగా హాట్ టాపిక్ అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉన్న అరూర్ గ్రామానికి చెందిన వెట్రివేల్.. స్థానికంగా కిండర్ గార్డెన్ స్కూల్‌ను నడుపుతున్నాడు. కొద్ది రోజులుగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న అతడు.. ధర్మపురిలోని కారు షోరూమ్‌కు వెళ్లి రూ.10నాణేలతో రూ.6లక్షలు చెల్లించి కారును కొనుగోలు చేశాడు. కాయిన్స్ రూపంలో డబ్బులు చెల్లించి.. కారును కొనుగోలు చేయడం స్థానికంగా చర్చనీయాంశం అవగా.. ఈ నేపథ్యంలో వెట్రివేల్ స్పందించాడు.



‘స్థానిక పిల్లలు రూ.10 నాణేలతో ఆడుకోవడం చూశాను. వాటితో ఆటలేంటని ప్రశ్నిస్తే.. అవి చెల్లవంటూ పిల్లలు సమాధానం చెప్పారు. పిల్లలే కాదూ.. పెద్ద వాళ్లు కూడా రూ.10నాణేల విషయంలో ఇదే అభిప్రాయంలో ఉన్నారు. కాయిన్స్‌తో లావాదేవీలు జరపడానికి వ్యాపారులు, కస్టమర్లు వెనకడుగు వేస్తారు. ఈ నాణేలు చెల్లుబాటవుతాయని ఏకంగా రిజర్వ్ బ్యాంకే వివరణ ఇచ్చినా.. ప్రజలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. బ్యాంకు సిబ్బంది కూడా వీటిని తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ నేపథ్యంలోనే రూ.10నాణేలు చలామణిలో ఉన్నాయనే విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే కాయిన్స్‌తో కారు కొనుగోలు చేయాలని భావించాను. బ్యాంకులు, గుళ్లు తిరిగి రూ.6లక్షల విలువైన రూ.10 నాణేలను సేకరించాను. వాటిని తీసుకోవడానికి కారు షోరూమ్ సిబ్బంది తొలుత నిరాకరించినా.. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సహకరించారు’ అని పేర్కొన్నాడు. 


Updated Date - 2022-06-20T23:36:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising