ఎంత మంచి యజమానో.. రూ.1.2 కోట్లు ఖర్చు పెట్టి ఉద్యోగులకు కలలో కూడా ఊహించని గిఫ్ట్..!
ABN, First Publish Date - 2022-10-17T21:02:09+05:30
ఉద్యోగం చేయడం చేస్తూ పైసా పైసా కూడబెట్టి.. అలా జమ చేసిన డబ్బుతో కారు లేదా బైక్ కొనుక్కోవాలని సగటు ఉద్యోగి కలలు కంటూ ఉంటాడు. కానీ ఆ కలలు.. అనూహ్యంగా నిజమైతే.. పొదుపు చేసిన డబ్బు నుంచి ఒక్క రూ
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం చేయడం చేస్తూ పైసా పైసా కూడబెట్టి.. అలా జమ చేసిన డబ్బుతో కారు లేదా బైక్ కొనుక్కోవాలని సగటు ఉద్యోగి కలలు కంటూ ఉంటాడు. కానీ ఆ కలలు.. అనూహ్యంగా నిజమైతే.. పొదుపు చేసిన డబ్బు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే బహుమతి రూపంలో ఇంటి ముందుకు కారు లేద బైక్ వస్తే. ఆ సంతోషాన్ని వర్ణించడం చాలా కష్టం. ప్రస్తుతం సరిగ్గా ఇటువంటి స్థితిలోనే ఉన్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఉద్యోగులు. సర్‌ప్రైజ్ చేస్తూ యజమాని కార్లు, బైక్‌లను గిఫ్ట్(cars and bikes as a gift on Diwali)గా ఇవ్వడంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు.
ఉద్యోగులు రోజులో ఎక్కువ సమయం.. తాము పని చేస్తున్న సంస్థల్లోనే గడుపుతారు. సంస్థ లాభాల్లోకి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. అయితే చాలా మంది యజమానులు ఈ శ్రమను కేవలం జీతంతో లెక్కగట్టేస్తారు. పని చేస్తున్నందుకు జీతం ఇస్తున్నాం కదా అని భావిస్తారు. కానీ కొందరు యజమానులు మాత్రం అంతమించి ఆలోచించి.. ఉద్యోగుల శ్రమను గుర్తిస్తారు. సంస్థ లాభాలు చూడటం కోసం పని చేసిన ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటారు. తమిళనాడుకు చెందిన జయంతి లాల్ కూడా ఈ కోవకు చెందన వారే.
తమిళనాడు(Tamil Nadu)లో చల్లని జ్యువెలరీ మార్ట్(Challani Jewellery Mart) ఓనర్ జయంతి లాల్ దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.1.2కోట్లు ఖర్చు(Rs 1.2 crores gifts to Employees) చేసి మరీ.. ఎనిమిది కార్లు, 18 బైక్‌లను కొనుగోలు చేశాడు. వాటిని సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దీపావళి కానుకగా అందించారు. దీంతో సదరు ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సందర్భంగా జయంతి లాల్ మీడియాతో మాట్లాడారు. తాను వ్యాపారంలో విజయం సాధించడానికి ఉద్యోగులే ముఖ్య కారణం అన్నారు. లాభనష్టాల్లో వెన్నంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులతో సమానంగా భావిస్తానన్నారు. అందుకే.. దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్(cars and bikes as a gift on Diwali)గా ఇచ్చినట్టు పేర్కొన్నారు.
Updated Date - 2022-10-17T21:02:09+05:30 IST