ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు ఆ సంస్థ CEO బంపర్ ఆఫర్.. నెల జీతంగా Gold

ABN, First Publish Date - 2022-05-15T21:30:16+05:30

ఆయన ఒక సంస్థకు సీఈఓ. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇంతకూ ఆ నిర్ణయం ఏంటనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నా.. తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒక సంస్థకు సీఈఓ. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇంతకూ ఆ నిర్ణయం ఏంటనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నా.. తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఇకపై నెల జీతంగా డబ్బులు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. డబ్బులకు బదులుగా అంతే విలువైన బంగారాన్ని ఉద్యోగుల చేతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్న సంస్థ ఏది. సీఈఓ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ప్రపంచాన్ని మొన్నటి వరకు కరోనా ముప్పు తిప్పలు పెడితే.. ఇపుడు ఉక్రెయిన్-రష్యా ఇబ్బంది పెడుతోంది. ఈ రెండూ సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల బాగు కోరే కొన్ని సంస్థలు వారికి అండగా నిలుస్తున్నాయి. కొన్ని సంస్థలు జీతాలు పెంచితే.. మరికొన్ని సంస్థలు రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌కు చెందన ట్యాలీమనీ(TallyMoney) సీఈఓ కెమరూన్ ప్యారీ (Cameron Parry) కీలక నిర్ణయం తీసుకున్నారు.


ఉద్యోగుల ఇబ్బందుల గురించి ఆలోచించిన ఆయన.. నెల జీతంగా డబ్బుకు బదులు Gold ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. Gold విలువ తరగని కారణంగా ఉద్యోగులు లబ్ధి పొందుతారని.. సంస్థలో పైలెట్ ప్రాజెక్ట్ ఈ విధానాన్ని ప్రారంభించారు. కొంత మంది సీనియర్ ఉద్యోగులకు నెల జీతంగా బంగారం ఇచ్చిన ఆయన.. కొద్ది రోజుల్లో ఉద్యోగులందరికీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నెల జీతంగా డబ్బే కావాలని కోరుకునే ఉద్యోగులకు పాత విధానంలోనే చెల్లించనున్నట్టు చెప్పారు. కాగా.. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2022-05-15T21:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising