ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Video: ఇదేంటని నిలదీయడమే Swiggy Delivery Boy చేసిన పాపమయింది.. ఈ ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-06-06T18:44:27+05:30

ఆ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ కస్టమర్‌కు ఫుడ్ పార్సిల్ ఇచ్చేందుకు రోడ్డు దాటుతున్నాడు.. తనతో పాటే రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఓ బస్ డ్రైవర్ ఢీకొట్టాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ కస్టమర్‌కు ఫుడ్ పార్సిల్ ఇచ్చేందుకు రోడ్డు దాటుతున్నాడు.. తనతో పాటే రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఓ బస్ డ్రైవర్ ఢీకొట్టాడు.. అయినా బస్ ఆపకుండా వెళ్లిపోయాడు.. దీంతో స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఆ బస్సును ఛేజ్ చేసి డ్రైవర్‌ను పట్టుకున్నాడు.. ఢీకొట్టి కూడా బస్ ఎందుకు ఆపలేదని ప్రశ్నించాడు.. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి, స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌పై చేయి చేసుకున్నాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 


ఇది కూడా చదవండి..

సెకండ్ హ్యాండ్‌లో సోఫాను కొనుగోలు చేసిందో మహిళ.. శుభ్రం చేద్దామని తీస్తే కనిపించిన కవర్లు.. వాటిల్లో..

   


తమిళనాడులోని కోయంబత్తూర్ అవినాషి రోడ్డులో ఫుడ్ డెలివరీ చేయడానికి స్విగ్గీ ఏజెంట్ మోహన్ సుందరం శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను స్కూల్ బస్సు డ్రైవర్ ఢీకొట్టాడు. ఆ మహిళ భుజానికి గాయమైంది. అయినా ఆ బస్సు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో మోహన్ ఆ బస్‌ను ఛేజ్ చేసి డ్రైవర్‌ను పట్టుకున్నాడు. రోడ్డు మీద ఆపి ఆ బస్ డ్రైవర్‌తో గొడవపడ్డాడు. ఆ సమయంలో అక్కడ డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అక్కడకు చేరుకున్నాడు. తప్పు చేసిన బస్ డ్రైవర్‌పై చర్యలు తీసుకొవాల్సింది పోయి, అనవసర విషయంలో ఎందుకు కలగజేసుకున్నావని మోహన్ సుందరంను ప్రశ్నించాడు. 


పలుసార్లు మోహన్‌పై చేయి చేసుకున్నాడు. బిత్తరపోయిన మోహన్ ఆ కానిస్టేబుల్‌కు సారీ చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం మోహన్, నగర పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. కమిషనర్ విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ సతీష్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. 



Updated Date - 2022-06-06T18:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising