ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వివేక’వాణి: లోకంలో విలువైన వజ్రాలివే..

ABN, First Publish Date - 2022-06-04T17:09:39+05:30

ఇది స్వామి వివేకానంద బోధనతో ముడిపడిన ఉదంతం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇది స్వామి వివేకానంద బోధనతో ముడిపడిన ఉదంతం. ఒకరోజు ఒక వ్యక్తి స్వామీజీని అడిగాడు..‘మీరు సన్యాసి అయివుండి, అందరూ డబ్బు సంపాదించాలని ఎందుకు చెబుతారు?’ 

వివేకానందుడు 'నేను రెండు రకాల డబ్బు సంపాదన గురించి చెబుతాను' అన్నారు.

ఆ వ్యక్తి, 'రెండు రకాల డబ్బు అంటే ఏమిటి?' అని అడిగాడు.


వివేకానందుడు.. ఒక సంపాదన మన జీవనం నడిచేందుకు.. మరో సంపాదన మన సంస్కారానికి సంబంధించినది అని అంటూ ఒక కథ చెప్పారు.. ఒక వ్యాపారి తన సేవకుడితో కలిసి ఒంటెలను కొనడానికి పశువుల మార్కెట్‌కి వెళ్లాడు. ఒక ఒంటెను కొనుగోలు చేసి తన ఇంటికి తెచ్చుకున్నాడు. తరువాత ఆ వ్యాపారికి ఒంటె వెనుక భాగంలో గల ఒక సంచిలో వజ్రాలు కనిపించాయి. ఈ వజ్రాలు తాను ఒంటెను కొనుగోలు చేసిన ఒంటె యజమానికి చెందినవని వ్యాపారికి అర్థమైంది. ఈ విషయాన్నితన సేవకునికి చెప్పి, ఇద్దరూ కలిసి ఆ ఒంటెను విక్రయించిన వ్యక్తి దగ్గరకు వెళ్లి, ఆ వజ్రాల సంచిని తిరిగి ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆ ఒంటెల వ్యాపారి వారికి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అయితే అందుకు ఆ వ్యాపారి నిరాకరిస్తూ తాను ఇప్పటికే రెండు వజ్రాలు తీసుకున్నానని చెప్పాడు. ఈ మాట విన్న వజ్రాల యజమానికి కోపం వచ్చింది. వెంటనే సంచిని తనిఖీ చేసి, మీరు ఏ రెండు వజ్రాల గురించి మాట్లాడుతున్నారు?' అని అడిగాడు. దీనికి ఒంటెను కొనుగోలు చేసిన వ్యాపారి మాట్లాడుతూ.. అవి నిజాయితీ, ఆత్మగౌరవం అని తెలిపాడు. ఈ వజ్రాలు తన దగ్గరున్న కారణంగానే మీరు మీ 50 వజ్రాలను తిరిగి పొందగలిగారని చెప్పాడు.

Updated Date - 2022-06-04T17:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising