ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురు చనిపోయిందని తండ్రికి ఫోన్... కారణమిదే నంటూ తండ్రి ఫిర్యాదు!

ABN, First Publish Date - 2022-06-22T16:40:04+05:30

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా చౌతాన్ పోలీస్ స్టేషన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా చౌతాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారాతరా గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తారాతరానికి చెందిన మంజు అనే వివాహిత నీటి ట్యాంకులో పడిపోయింది. దీనిని గమనించిన చుట్టుపక్కలవారు బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.


అయితే వైద్యులు ఆమెను పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. జిల్లా ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహానికి మెడికల్ బోర్డు నుంచి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి తండ్రి  అశోక్‌కుమార్‌ తమ కుమార్తె మంజుకు 6 సంవత్సరాల క్రితం వివాహమైందని తెలిపారు. వారికి 4 సంవత్సరాల కుమార్తె, రెండేళ్ల కుమార్తె కుమారుడు ఉన్నారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత అత్తింటివారు కట్నం కోసం వేధించారన్నారు. చాలాసార్లు పంచాయితీలు జరిగాయి. అయినా అత్తమామలు కట్నం విషయంలో వెనక్కి తగ్గలేదు. ఇంతలో సోమవారం మంజు తండ్రికి కూతురు చనిపోయిందనే ఫోన్ వచ్చింది. కాగా మృతురాలిని భర్త అశోక్ కుమార్, అత్తమామలు తన కుమార్తెను హత్య చేశారని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-22T16:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising