ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబోయ్.. ఇదేం అభిమానం.. శ్రీదేవి కోసం అతను చేసిన త్యాగాలు వింటే షాక్.. ఆమె చనిపోయిన తర్వాత..

ABN, First Publish Date - 2022-02-25T17:18:24+05:30

తన అందంతోనూ, నటనతోనూ ఎంతో మందిని ఉర్రూతలూగించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన అందంతోనూ, నటనతోనూ ఎంతో మందిని ఉర్రూతలూగించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి. ఆమెకు ఇతర దేశాలలో కూడా అభిమానులున్నారు. అయితే అందరిలోనూ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని దదుని గ్రామంలో ఉండే ఓం ప్రకాశ్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే అతను శ్రీదేవికి వీరాభిమాని. శ్రీదేవిని మాత్రమే ఆరాధించి పెళ్లి కూడా చేసుకోలేదు. శ్రీదేవినే తన భార్యగా భావిస్తూ ఉంటాడు. అంతేకాదు శ్రీదేవి పేరుతో ఓ ఓటర్ కార్డును, రేషన్ కార్డును కూడా సృష్టించాడట. 58 ఏళ్ల వయసులోనూ అతని అభిమానం ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. 


`శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. అది వీలు కాదని తెలుసు. అందుకే బ్రహ్మచారిగా ఉండిపోయా. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణ వార్త విని షాకయ్యా. ఐదు రోజులు అన్నం తినలేదు. 11 రోజుల తర్వాత శాస్త్రోక్తంగా ఆమెకు కర్మ చేయించా. నా భార్య చనిపోతే ఎలా చేయించే వాడినో శ్రీదేవికీ అలాగే చేశా. నేను బతికి ఉన్నంత వరకు శ్రీదేవికి ప్రతి ఏడాది వర్ధంతి జరుపుతూనే ఉంటాన`ని ఓంప్రకాశ్ చెప్పాడు. 


ఓం ప్రకాశ్ యుక్తవయసులో ఉండగా జరిగిన ఓ ఘటనను గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. `ఒకసారి శ్రీదేవి ఫొటో పట్టుకుని ఓం ప్రకాశ్ మా ఊరి కాలవ పక్కన నడుస్తున్నాడు. పెద్ద గాలి వీచి ఆ ఫొటో కాలువలో పడిపోయింది. ఓం ప్రకాశ్ నిమిషం కూడా ఆలోచించకుండా ఆ ఫొటో కోసం కాలువలో దూకేశాడు. ఫొటో పట్టుకుని బయటకు వచ్చాడు. ఈత రాదనే విషయం తెలిసి కూడా ఓం ప్రకాశ్ అంత సాహసం చేశాడ`ని గ్రామస్థుడు ఒకరు చెప్పారు. 


 

Updated Date - 2022-02-25T17:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising