ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వండి అంటూ ఈ బిలియనీర్‌ను అడిగితే జరిగింది ఇదీ...

ABN, First Publish Date - 2022-11-24T19:41:19+05:30

తన ఆటోగ్రాఫ్ కోరిన అభిమానికి యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ రాసిన ఓ లేఖ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ యాపిల్(Apple Inc.) సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్(Steve Jobs) అంటే తెలియని వాళ్లు ఉండరు. ఐ ఫోన్లు, మ్యాక్ కంప్యూటర్లు కలిగి ఉండటమే ఓ హోదా అనేలా సంస్థ బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించిన మేధావి. నాణ్యతతో పాటూ యూజర్లకు వస్తువినియోగంలో కొత్త అనుభూతిని పంచడమే వ్యూహంగా దూసుకెళ్లిన ఆయన టెక్ రంగంలో ఓ దార్శనికుడిగా, గొప్ప నాయకుడిగా సాటిలేని పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అందుకే..స్టీవ్ జాబ్స్‌ ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఓ రోల్ మోడల్. స్టీవ్ జాబ్స్ విజయాల గురించి తెలిసిన ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ ఆయన కనిపించిననప్పుడల్లా అడుగుతుండేవారు. కొందరు మెయిల్స్ కూడా చేసేవారు. కానీ.. ఆయనకు ఆటోగ్రాఫ్‌ వంటివి ఇచ్చే అలవాటు ఉండేది కాదు. అటువంటి అభ్యర్థనలను ఆయన సున్నితంగా తిరస్కరిస్తుండేవారు. ఈ నేపథ్యంలో తన ఆటోగ్రాఫ్(Autograph) కోరిన అభిమానికి(Fan) స్టీవ్ జాబ్స్ రాసిన ఓ లేఖ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

1983లో కాలిఫోర్నియాకు చెందిన ఎల్ఎన్ వేరాన్.. స్టీవ్ జాబ్స్ ఆటోగ్రాఫ్(Autograph) కోరుతూ ఆయనకు ఓ లేఖ(Letter) రాశారు. అయితే..ఆటోగ్రాఫ్‌లపై విముఖత ప్రదర్శించే జాబ్స్.. వేరాన్‌కు అదే సంవత్సరం మే 11న ప్రత్యుత్తరమిచ్చారు. వేరాన్ తన ఆటోగ్రాఫ్ కోరడం తనకు దక్కిన ఓ గౌరవమని వ్యాఖ్యానించిన స్టీవ్ జాబ్స్ ఆటోగ్రాఫ్ మాత్రం కుదరదని సున్నితంగానే చెప్పారు. అయితే.. ఆ లేఖ చివర తన పూర్తిపేరును రాశారు. సంతకం మాత్రం చేయలేదు. స్టీవ్ జాబ్స్ రాసిన ఈ లేఖను ఇటీవలే వేలం వేయగా.. 479,396 డాలర్లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు రూ. 4 కోట్లకు సమానం. లేఖ వెనుకున్న ఈ ఆసక్తికర ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్(Viral) అవుతోంది.

స్టీవ్ జాబ్స్ పాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా 2011 అక్టోబర్ 5న మరణించారు. కన్సూమర్ టెక్నాలజీ రంగంలో ఓ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వ్యాపారస్తుల్లో ఉండాల్సిన నాయకత్వ లక్షణాలకు ఆయన నిలువెత్తు ప్రతిరూపం అనే భావన కూడా ఉంది. సూక్ష్మమైన విషయాలు కూడా స్టీవ్ జాబ్స్ దృష్టిని దాటిపోవని ఆయనతో కలిసి పనిచేసిన వారు చెబుతారు. తన అభిప్రాయాలు, లక్ష్యాలకు తగిన వారితో బంధానికే ఆయన విలువనిచ్చేవారని పరిశీలకులు అంటారు.

Updated Date - 2022-11-24T20:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising