ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఒత్తిడికి, వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి!

ABN, First Publish Date - 2022-04-13T12:50:56+05:30

‘చాణక్య నీతి’లో మనిషి తన జీవితంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చాణక్య నీతి’లో మనిషి తన జీవితంలో విజయవంతం కావడానికి అనుసరించాల్సిన పలు విషయాలు ఉన్నాయి. దీనితో పాటు జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, అనవసర వివాదాలు మొదలైన వాటిని నివారించే మార్గాలు కూడా కనిపిస్తాయి. వీటిని అనుసరించడం ద్వారా వ్యక్తి లక్ష్యంపై పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టగలుగుతాడు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. మహా పండితుడు ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో పేర్కొన్న పలు అంశాలను అవలంబించడం ద్వారా ఇటువంటి సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. 


మానసిక ఒత్తిడి, వివాదాలకు దూరంగా ఉండాలంటే మనిషి కోపానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. కోపంతో పాటు కఠినమైన విషయాలు మాట్లాడకుండా ఉంటే.. వివాదాల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రతికూల శక్తిని నివారించగలుగుతాం. వాటి నుండి తలెత్తే పరిణామాలను అడ్డుకోగలుగుతాం. అత్యాశ అనేది మనిషికి అనవసరమైన ఒత్తిడిని కల్పిస్తుంది. అతనిని స్వార్థపరుడిని చేస్తుంది. తప్పుడు పనులకు పురిగొల్పుతుంది. ఇటువంటి సందర్భాల్లోనే మనిషి వివాదాల్లో చిక్కుకుని ఒత్తిడికి గురవుతాడు. మనిషి అహంకారానికి కూడా దూరంగా ఉండటం ఎంతోముఖ్యం. ఇది వ్యక్తిని వాస్తవికత నుండి దూరం చేయడమే కాకుండా అతని సామర్థ్యాన్ని కూడా  దెబ్బతీస్తుంది. ఫలితంగా అనవసర సమస్యల్లో చిక్కుకోవాల్సివస్తుంది. 

Updated Date - 2022-04-13T12:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising