స్టాంపు పేపర్‌ను ఎన్నాళ్లు వినియోగించవచ్చు?.. చెల్లుబాటు తేదీ ఏమైనా ఉంటుందా?
ABN, First Publish Date - 2022-02-17T17:39:04+05:30
స్టాంప్ పేపర్‌ను అనేక ప్రయోజనాల కోసం...
స్టాంప్ పేపర్‌ను అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా చట్టపరమైన కార్యకలాపాలలో దీని ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. ఆస్తి కొనుగోలు, విక్రయం, వ్యాపార లావాదేవీల వ్యవహారాలలో స్టాంప్ పేపర్లను వినియోగిస్తారు, ఇందుకోసం ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించాలి. అది స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించాల్సివుంటుంది. ఈ స్టాంప్ డ్యూటీని స్టాంప్ పేపర్ రూపంలో ఇస్తారు. ఇండియన్ స్టాంప్ యాక్ట్, 1899ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది, దీని కింద స్టాంపు డ్యూటీ చెల్లింపు జరుగుతుంది. దీనిలో రాష్ట్రాలకు కూడా సొంత నియమాలు ఉంటాయి.
దీని ప్రకారం చూస్తే వివిధ రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ భిన్నంగా ఉంటుంది. సేల్ డీడ్, లీజు డీడ్, సెక్యూరిటీ లేదా ఫైన్ చెల్లింపు విషయంలో స్టాంప్ పేపర్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కొంతమంది స్టాంప్ పేపర్లను భవిష్యత్తు ఉపయోగాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒక్కోసారి స్టాంపు పేపర్ కూడా పనికిరాకుండా పోతుంది. అయితే కొన్ని నియమాలకు లోబడి.. ఉపయోగించని లేదా కాలం చెల్లిన స్టాంప్ పేపర్లను తిరిగి వాపసు చేయవచ్చు. అయితే స్టాంప్ పేపర్ ఎంత పాతదో దీనిలో తెలుస్తుంది. భారతీయ స్టాంప్ చట్టంలో గడువు తేదీకి సంబంధించిన ప్రస్తావన లేదు. దీని ప్రకారం చూస్తే.. స్టాంప్ పేపర్‌కు గడువంటూ ఉండదు. అయినప్పటికీ భారతీయ స్టాంప్ చట్టంలోని సెక్షన్ 64లో దానికి కొన్ని పరిమితులు ఉన్నట్లు పేర్కొన్నారు. స్టాంప్ పేపర్ కొనుగోలుదారు దానిని ఉపయోగిచకపోతే దానిపై భత్యం లేదా వాపసు తీసుకోవచ్చని ఈ విభాగం పేర్కొంది. అయితే కట్-ఆఫ్ లేకపోతే మాత్రమే ఇది జరుగుతుంది. నిబంధనల ప్రకారం, స్టాంప్ పేపర్‌ను కొనుగోలుదారు ఉపయోగించనట్లయితే, అతను దానిని కొనుగోలు చేసిన 6 నెలలలో తిరిగి వాపసు చేయవచ్చు. సుప్రీంకోర్టు కూడా దీనిని స్పష్టం చేస్తూ.. డాక్యుమెంట్ కోసం ఉపయోగించడానికి ఆరు నెలల ముందు కొనుగోలు చేసిన స్టాంప్ పేపర్‌ను తిరిగి ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని లేదని పేర్కొంది. IndiaCorpLaw విశ్లేషణ ప్రకారం స్టాంప్ పేపర్‌కు గడువు అంటూ తేదీ ఉండదు. అయితే ఉపయోగించని స్టాంప్ పేపర్‌ను వాపసు కోసం కొనుగోలు చేసిన ఆరు నెలలలోపు స్టాంప్ కలెక్టర్‌కు తిరిగి ఇవ్వాలి. సెక్షన్ 54లో నిర్దేశించిన పరిమితి వ్యవధిలో ఎలాంటి సడలింపు లేదని గమనించాలి.
Updated Date - 2022-02-17T17:39:04+05:30 IST