ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి నేరస్థుడి లోపల సహాయం కోసం అర్థించే బాధితుడు ఉంటాడు: ఆచార్య రవిశంకర్

ABN, First Publish Date - 2022-05-01T14:04:40+05:30

తన యూరోపియన్ పర్యటనలో భాగంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన యూరోపియన్ పర్యటనలో భాగంగా ప్రపంచ ఆధ్యాత్మిక వేత్త, గురుదేవ్ రవిశంకర్ ఐక్యరాజ్యసమితిలో  ప్రత్యేక ప్రసంగం చేశారు. ప్రపంచంలో శాంతి కోసం పోరాడే శక్తులు, ఈ దిశగా స్పృహ కలిగిన వ్యక్తులు ఏకం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనముందున్న ప్రస్తుత వాతావరణంలో అందరం చేయి చేయి కలుపుతూ సమాజం నుండి చీకట్లు, అపనమ్మకాలను దూరం చేసి సామరస్యానికి కృషి చేయాలన్నారు. 


గురుదేవ్ జెనీవా ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ కాశ్మీర్, కొలంబియా తదితర ప్రదేశాలలో సంఘర్షణల పరిష్కారంలో తన భాగస్వామ్యం గురించి మాట్లాడటానికి ఆహ్వానించారన్నారు. సంఘర్షణకు మూలకారణం గురించి గురుదేవ్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి వ్యక్తుల మధ్య నెలకొన్న అపనమ్మకం లేదా కమ్యూనికేషన్ తెటిపోయినప్పుడు విభేదాలు తలెత్తుతాయి. ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడని నేను నమ్ముతున్నాను. వారు సహాయం కోసం అర్థిస్తుంటారు. ఐక్యరాజ్యసమితిలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఇండియాస్ పర్మనెంట్ మిషన్, జెనీవాలో "పాండమిక్ అనంతర ప్రపంచంలో ఐక్యత, సహకారం" అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో గురుదేవ్ ప్రసంగించారు. గురుదేవ్ జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుండి గ్లోబల్ 'ఐ స్టాండ్ ఫర్ పీస్' ప్రచారాన్ని ప్రారంభించారు. గురుదేవ్ యూరోప్, జర్మనీ, పోలాండ్, స్విట్జర్లాండ్‌లకు వెళ్లారు. అక్కడ ఆయన ఈ ప్రచారంలో వేలాది మంది మధ్య ఉత్సాహంగా పాల్గొన్నారు. త్వరలో యూఎస్‌లోని 30కి పైగా నగరాల్లో ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 

Updated Date - 2022-05-01T14:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising