ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాల్చిన చెక్క నుంచి టీ ఎగుమతుల వరకు.. ఆసక్తికర శ్రీలంక సంగతులు..

ABN, First Publish Date - 2022-04-07T15:36:42+05:30

శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక. రాజకీయ సంక్షోభం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక. రాజకీయ సంక్షోభం మధ్య, దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఇటీవల ఎమర్జెన్సీని  ప్రకటించారు. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ఏప్రిల్ ఒకటిన నిర్ణయం తీసుకున్నారు. తరువాత దానిని ఎత్తివేశారు. ఈ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇది శ్రీలకంలోని ప్రస్తుత పరిస్థితి. అయితే శ్రీలంక కొన్ని అంశాలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వరల్డ్ టాప్ ఎక్స్‌పోర్ట్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే టీ ఎగుమతి చేసే అగ్ర దేశాల్లో శ్రీలంక ఒకటి. వీటిలో చైనా, కెన్యా, శ్రీలంక, ఇండియా, పోలాండ్ ఉన్నాయి. 


టీ ఎగుమతుల పరంగా శ్రీలంకలో అతిపెద్ద కంపెనీ జార్జ్ స్టువర్ట్ గ్రూప్. కాగా దాల్చిన చెక్కను ప్రపంచవ్యాప్తంగా ఔషధంగా, ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. దీనిని 2000బీసీలో ఈజిప్టుకు చెందిన వ్యక్తి శ్రీలంకలో కనుగొన్నాడు. ప్రపంచంలో 80 నుండి 90 శాతం దాల్చినచెక్క శ్రీలంక నుండి రవాణా అవుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అంతే కాదు జలవిద్యుత్ పరంగా కూడా శ్రీలంక స్థానం మెరుగ్గా ఉంది. ఇక్కడ పలు జలపాతాలు, నదులు ఉన్నాయి. వాటి నుండి విద్యుత్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది. ఒక నివేదిక ప్రకారం దాదాపు 50 శాతం జనాభా అవసరాలను తీర్చడానికి నీటి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. అందుకే ఇక్కడ జలవిద్యుత్‌పై చాలా పనులు జరిగాయి. అక్షరాస్యత పరంగా కూడా పొరుగు దేశాల కంటే శ్రీలంక స్థానం మెరుగ్గా ఉంది. ప్రపంచ డేటా అట్లాస్ నివేదిక ప్రకారం 2019లో శ్రీలంకలో అక్షరాస్యత రేటు 92.3. ఇది గత కొన్ని సంవత్సరాలలో హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ, సగటున ఈ సంఖ్య 90 శాతానికి దగ్గరగా ఉంది. శ్రీలంక జాతీయ పతాకం ప్రపంచంలోని పురాతన జెండాలలో ఒకటిగా పరిగణిస్తారు. శ్రీలంక మొదటి రాజు (విజయ్) భారతదేశం నుండే బంగారు సింహం గుర్తు జెండాను తీసుకున్నాడని చెబుతారు. బంగారు సింహం 1815 వరకు శ్రీలంక జెండాలో భాగంగా ఉంది. అయితే శ్రీలంక బ్రిటిష్ సిలోన్‌గా మారినప్పుడు జెండా మార్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948లో బంగారు ఖడ్గం పట్టిన సింహానికి జెండాలో చోటు కల్పించారు. 

Updated Date - 2022-04-07T15:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising