ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

new twist to the Sonali Phogat case: సోనాలీ ఫోగాట్ కేసులో కొత్త ట్విస్ట్

ABN, First Publish Date - 2022-08-27T15:09:22+05:30

హరియాణాకు చెందిన బీజేపీ నాయకురాలు(BJP leader), టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫోగాట్‌(42)(Sonali Phogat) హత్య కేసులో కొత్త ట్విస్ట్(new twist) తాజాగా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : హరియాణాకు చెందిన బీజేపీ నాయకురాలు(BJP leader), టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫోగాట్‌(42)(Sonali Phogat) హత్య కేసులో కొత్త ట్విస్ట్(new twist) తాజాగా వెలుగుచూసింది.సోనాలీ గురుగ్రామ్ నగరంలోని సెక్టారు 102 గ్రీన్స్‌(Gurgaon Greens) ప్రాంతంలోని అపార్టుమెంటులోని కృష్ణకాంత్ తివారీ ఫ్లాటులో అద్దెకు ఉండేవారు. ఈ ఫ్లాట్ అద్దె ఒప్పంద పత్రాల్లో ఆమె పర్సనల్ అసిస్టెంట్(personal assistant) సుధీర్ సాంగ్వాన్(Sudhir Sangwan)... సోనాలీ ఫోగాట్‌ను తన భార్య(wife) అని పేర్కొన్నట్లు తాజాగా వెలుగుచూసింది.సోనాలీ ఈ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నప్పుడు పోలీసు వెరిఫికేషన్ కూడా జరిగింది.సోమవారం గోవాలో సోనాలీ కన్నుమూశారు. తొలుత గుండెపోటుతో సోనాలీ (BJP leader and former Bigg Boss contestant)మరణించిందని చెప్పినా, ఆమె సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి జరిపిన దర్యాప్తులో హత్య అని తేలింది.


 సోనాలీ హత్య కేసుకు సంబంధించి సోనాలి ఫోగట్ ఇద్దరు సహాయకులు, సుధీర్ సాంగ్వాన్,సుఖ్‌విందర్ వాసిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది.సోనాలీ గోవాకు బయలుదేరే ముందు ఆమె తన సహాయకుడితో కలిసి గురుగ్రామ్‌లోని ఫ్లాట్‌కి వెళ్లి, అక్కడి నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికి క్యాబ్‌ తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.సోనాలీ ఫోగాట్ శవ పరీక్షలో ఆమె శరీరంపై పలు గాయాలున్నాయని తేలింది.గోవాలోని అంజనా బీచ్ సమీపంలో ఉన్న కర్లీస్ రెస్టారెంట్‌లో పార్టీ సందర్భంగా సోనాలి ఫోగాట్ 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపిన పానీయం తాగినట్లు పోలీసులు చెప్పారు.


 మత్తు పానీయం తాగిన సోనాలీ ఫోగాట్ నియంత్రణలో లేనపుడు ఆమెను నిందితుడు టాయిలెట్‌కి తీసుకెళ్లి రెండు గంటల పాటు లోపల ఉంచాడని, ఆ సమయంలో టాయిలెట్‌లో ఏం చేశాడనే విషయంపై గోవా పోలీసులు(Goa Police) ఆరా తీస్తున్నారు.పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి వారితో సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు.పానీయం తాగిన తర్వాత సోనాలీ కుంటుతున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజీ(CCTV VIDEO) పోలీసులకు దొరికింది.


 ఈ ఫుటేజీలో సోనాలీ రెడ్ క్రాప్ టాప్, బ్లూ షార్ట్ ధరించి పబ్‌లోకి కుంటూకుంటూ వెళుతుండగా, పక్కన ఉన్న ఆమె పీఏ సుధీర్ సాంగ్వాన్ పట్టుకొని పోవడం కనిపించింది. సోనాలీ హత్య కేసులో నిందితులైన సుధీర్ సాంగ్వాన్,సుఖ్‌విందర్ వాసిలు(Sukhwinder Wasi) కెమేరా కంటికి చిక్కడంతో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు ఈ హత్య ఎందుకు చేశారనే విషయంపై గోవా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-08-27T15:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising