ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువకుడు.. దారిలో అతడిని హతమార్చిన దుండగులు.. నిజానికి ఆ దుండగులెవరంటే..

ABN, First Publish Date - 2022-05-29T09:30:54+05:30

రైల్వే పట్టాలపై పోలీసులకు ఒక తలలేని మృతదేహం లభించింది. ఆ శవం గురించి విచారణ చేస్తుండగా... రెండురోజుల తరువాత ఊరి చివర పొదల్లో ఒక తల దొరికింది. పోలీసులు ఈ హత్యకేసులో దర్యాప్తు చేయగా.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ శవం ఒక 19 ఏళ్ల కుర్రాడిది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వే పట్టాలపై పోలీసులకు ఒక తలలేని మృతదేహం లభించింది. ఆ శవం గురించి విచారణ చేస్తుండగా... రెండురోజుల తరువాత ఊరి చివర పొదల్లో ఒక తల దొరికింది. పోలీసులు ఈ హత్యకేసులో దర్యాప్తు చేయగా.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ శవం ఒక 19 ఏళ్ల కుర్రాడిది. అతడిని తన తల్లి హత్య చేయించింది. ఈ క్రూరమైన ఘటన బీహార్ రాజధాని పట్నాలో జరిగింది. 


వివరాల్లికి వెళితే.. పట్నాకి చెందిన జూలీ దేవికి సూరజ్ కుమార్(19) అనే కుమారుడు ఉన్నాడు. జూలీదేవి భర్త ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రానికి వెళ్లాడు. ఈ క్రమంతో జూలీదేవి మరొక యువకుడు ధర్మేంద్రతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఒకరోజు జూలీదేవి తన ప్రియుడు ధర్మేంద్రతో బెడ్ రూంలో ఉండగా.. అనుకోకుండా సూరజ్ అక్కడికి వచ్చాడు. ఆ తరువాత సూరజ్ తన తల్లితో గొడవపడ్డాడు. ఈ విషయం అందరికీ చెబుతానని సూరజ్ తన తల్లితో చెప్పాడు. అప్పుడు జూలీదేవి ప్రియుడు ధర్మేంద్ర.. సూరజ్‌ని చితకబాది.. ఎవరితో ఈ విషయం గురించి బయటికి చెప్పాకూడదని బెదిరించాడు.


కొన్ని రోజుల తరువాత సూరజ్ కుమార్ తన తల్లితో మళ్లీ గొడవపడ్డాడు. ఆమె వివాహేతర సంబంధం గురించి తన తాతయ్య కుటుంబానికి చెబుతానని.. అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. సూరజ్ తన తాతయ్య ఇంటికి వెళుతుండగా.. మార్గ మధ్యంలో ధర్మేంద్ర తన స్నేహితులతో కలిసి సూరజ్‌పై కత్తులతో దాడిచేశాడు. సూరజ్ చనిపోయాక.. అతని తలను శరీరం నుంచి వేరు చేసి ఊరి చివర చెట్ల చాటున దాచి పెట్టారు. తల లేని శరీరాన్ని రైలు పట్టాల పక్కన పడేశారు.


కానీ పోలీసులకు సూరజ్ తల దొరకడంతో దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడ్డాయి. పోలీసులు ధర్మేంద్ర అతని స్నేహితులను సూరజ్ కుమార్ హత్యకేసులో అరెస్టుల చేశారు.



Updated Date - 2022-05-29T09:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising