ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రి కనపడడం లేదంటూ కొడుకు ఫిర్యాదు.. అనుకోకుండా వేరే కేసులో పట్టుబడిన కిరాయి హంతకులు.. అసలు హంతకుడెవరంటే..

ABN, First Publish Date - 2022-01-04T11:50:01+05:30

తన తండ్రి కనపడడం లేదంటూ ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తరువాత తప్పిపోయిన వ్యక్తి మృత దేహం ఒక కాలువలో పోలీసులకు దొరికింది. ఆ శవం తప్పిపోయిన వ్యక్తిదే కావడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తుండగా.. మరో కేసులో కిరాయి హంతకులు పట్టుబడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన తండ్రి కనపడడం లేదంటూ ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తరువాత తప్పిపోయిన వ్యక్తి మృత దేహం ఒక కాలువలో పోలీసులకు దొరికింది. ఆ శవం తప్పిపోయిన వ్యక్తిదే కావడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తుండగా.. మరో కేసులో కిరాయి హంతకులు పట్టుబడ్డారు. వారే ఆ హత్య కూడా చేశామని ఒప్పుకున్నారు. పోలీసుల విచారణలో ఆ వ‌ృద్ధుడి హత్య చేయడానికి అతని కొడుకే రూ.7 లక్షల సుపారీ ఇచ్చాడని తెలిసింది. 


వివరాల్లోకి వెళితే.. హర్యాణా రాష్ట్రంలోని సోనీపత్ జిల్లా పరిధి జాజీ గ్రామంలో మోహిత్ అనే యువకుడు తన తండ్రి రాజేంద్ర(65) కనబడడం లేదంటూ గత నవంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తరువాత రాజేంద్ర శవం పక్క గ్రామంలోని ఒక కాలువలో దొరికింది. అప్పటి నుంచి పోలీసులకు రాజేంద్ర హత్య కేసులో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 


కానీ డిసెంబర్‌ 27న పోలీసులు మరో హత్య కేసులో ముగ్గరు కిరాయి హంతకులను అరెస్టు చేశారు. ఆ ముగ్గురూ ఇటీవలే ఒక హత్య చేసి పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్‌లో విచారణ చేయగా.. రాజేంద్రని డబ్బుకోసం తామే హత్య చేసినట్టు వారు ఒప్పుకున్నారు. రాజేంద్రని హత్య చేయడానికి అతని కొడుకు మోహిత్ వారికి రూ.7 లక్షలు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నాడని.. అందులో అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు ఇచ్చాడని తెలిపారు. దీంతో పోలీసులు మోహిత్‌ని అరెస్టు చేశారు. 


తన తండ్రిని మోహిత్ ఎందుకు హత్య చేయించాడో? పోలీసులు విచారణ చేశారు. రాజేంద్రకు మోహిత్ రెండవ కొడుకు. ఆస్తి విషయంలో రాజేంద్ర పెద్ద కొడుకు పేరిట ఎక్కువ వాటా ఇచ్చేస్తున్నాడని తెలిసి.. మోహిత్ కోపంతో రగిలిపోయాడు. అందువల్లే తండ్రిని హత్య చేసేందుకు మోహిత్ కిరాయి హంతకులకు పెద్ద సుపారీ ఇచ్చాడు. కానీ ఆ హంతకులు మరో హత్య కేసులో త్వరగా పట్టుబడడంతో మోహిత్ కథ అడ్డం తిరిగింది. 

Updated Date - 2022-01-04T11:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising