ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: మనిషి జన్మించకముందే విధి కొన్నింటిని లిఖిస్తుంది.. వాటిని మార్చడం అసాధ్యం!

ABN, First Publish Date - 2022-01-31T12:23:12+05:30

కర్మలు మనిషి జీవితాన్ని విడిచిపెట్టవని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్మలు మనిషి జీవితాన్ని విడిచిపెట్టవని అంటారు. దూడ తన తల్లిని ఆవుల మందలో గుర్తించి, దానిని అనుసరించినట్లే కర్మలు మనల్ని వెంటాడుతాయి. ఆచార్య చాణక్యుడు దీనిని విశ్వసించాడు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి జన్మించక ముందు అంటే.. గత జన్మలో చేసిన పనులను అనుసరించి ఈ జన్మలో కొన్ని కర్మలు నిర్ణయించబడతాయని తెలిపారు. వీటిలో మార్పు ఉండదని కూడా చెప్పారు. వాటిలో మొదటి విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తి వయస్సు అతని పుట్టుకకు ముందే నిర్ణయమవుతుంది. దానికిమించి ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవించలేడు. 


నిర్ణీత సమయానికే అతడు మరణిస్తాడు. అలాగే మరణం ఎలా జరగాలి? అనేది కూడా ముందే రాసి పెట్టివుంటుంది. వ్యక్తికి సంబంధించిన విధి గత జన్మలోని కర్మల ప్రకారం నిర్ణయించబడుతుంది. అతని విధిలో ఏది రాసివుందో, దానినే అతను పొందగలుగుతాడు. అదృష్టాన్ని అనుసరించి, మనిషి సుఖదుఃఖాలను పొందుతాడు. మనిషికి ఎంత జ్ఞానం, ఎంత డబ్బు లభిస్తుందనే దాని గురించి భగవంతుడు అప్పటికే నిర్ణయిస్తాడని ఆచార్య చాణక్య తెలిపారు. అయితే భగవంతుడు మనిషికి పని చేసే శక్తిని ఇచ్చాడని, తద్వారా మనిషి తన అదృష్టాన్ని చక్కదిద్దుకోవచ్చని, అలాగే రాబోయే జన్మను మెరుగుపరుచుకోగలుగుతాడని ఆచార్య చాణక్య తెలిపారు.

Updated Date - 2022-01-31T12:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising