ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యక్తితో బేరం.. అదే ఈమె జీవితాన్ని మార్చేసింది.. కోట్ల విలువ చేసే కంపెనీని అమ్మేసి..

ABN, First Publish Date - 2022-01-11T19:08:32+05:30

ఆమె ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.. తండ్రి పెద్ద వ్యాపారవేత్త.. ఆయన ప్రోత్సాహంతో కూడా కర్మాగారం నెలకొల్పింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.. తండ్రి పెద్ద వ్యాపారవేత్త.. ఆయన ప్రోత్సాహంతో ఆమె కూడా కర్మాగారం నెలకొల్పింది.. ఇంజినీరింగ్ టూల్స్ తయారు చేసే సంస్థను స్థాపించి లాభాలు ఆర్జించింది.. కోట్లలో సంపాదించేది.. అయితే రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యక్తితో బేరం తర్వాత ఆమె ఆలోచనా విధానం మారింది.. సంపాదనపై కాకుండా.. ఇతరులకు చేయూతనివ్వడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది.. 40 గ్రామాలను దత్తత తీసుకుని వారికి సహాయం చేస్తోంది.. ఆమె పేరు జయశ్రీ రవీంద్ర రావు. 


`నాకు చిన్నప్పటి నుంచి సామాజిక సేవ అంటే ఇష్టం. చదువు తర్వాత స్వంతంగా బిజినెస్ ప్రారంభించి లాభాలు సంపాదించాను. కోట్ల రూపాయల విలువైన సంస్థగా మార్చాను. ఒకరోజు కారులో ఇంటికి వెళ్తూ రోడ్డు పక్కన కూరగాయలు కొనడానికి ఒక దుకాణానికి వెళ్లాను. అక్కడ కూరగాయలమ్మే వ్యక్తితో రూ.5 గురించి బేరం ఆడాను. చాలా సేపటి తర్వాత అతను రూ.5 తగ్గించాడు. ఇంటికి వెళ్లాక ఆలోచిస్తే నాకు సిగ్గుగా అనిపించింది. ఇంత సంపాదిస్తూ రూ.5 కోసం అంతలా వాదించానేంటి అనిపించింది. ఆ ఘటన నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది. 


ఇప్పటివరకు సంపాదించినది చాలు.. ఇక సమాజ సేవ చేయాలనిపించింది. కోట్ల విలువ చేసే నా సంస్థను రూ.25 వేలకే నా ఉద్యోగులకు అమ్మేశాను. `గ్రామరి` పేరుతో ఓ ఎన్జీవో సంస్థను స్థాపించాను. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని పంచ్‌గని పరిధిలోని 40 గ్రామాలను దత్తత తీసుకున్నాను. అక్కడి ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి కూడా అవగాహన లేదు. గత 14 ఏళ్లుగా వారి కోసం మా సంస్థ పని చేస్తోంది. ఆయా గ్రామాలకు తాగునీటిని అందిస్తోంది. ఇక, ఆయా గ్రామాలకు చెందిన మహిళలకు వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో తర్ఫీదునిచ్చి, ఉద్యోగ కల్పన కూడా చేశాం. పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నామ`ని జయశ్రీ చెప్పారు. 

Updated Date - 2022-01-11T19:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising