పాముల ప్రవర్తనపై పరిశోధన... వెలుగులోకి ఆసక్తికర విషయాలు!
ABN, First Publish Date - 2022-12-15T12:13:31+05:30
సైన్స్ ప్రపంచంలో ఆవిష్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. పరిశోధనల్లో కొత్త విషయాలు వెల్లడయినప్పుడు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న నమ్మకాలు తుడిచిపెట్టుకుపోతాయి.
సైన్స్ ప్రపంచంలో ఆవిష్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. పరిశోధనల్లో కొత్త విషయాలు వెల్లడయినప్పుడు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న నమ్మకాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇటీవల శాస్త్రవేత్తలు పాములకు సంబంధించిన నూతన విషయాలు వెల్లడించారు. ఫలితంగా పలు పాత నమ్మకాలకు చెక్ పెట్టాల్సివస్తుంది. ఆడ పాములకు క్లిటోరిస్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాములను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పాముల నాలుక రెండు భాగాలుగా విభజితమై ఉంటుంది.
మగ పాములకు జననాంగాలు ఉంటాయి. దీనిని హెమిపెనెస్ అని కూడా అంటారు. ఆడ పాముల్లో హెమిక్లిటోరిస్ అనే అవయవాన్ని పరిశోధకులు కనుగొన్నారు. పునరుత్పత్తి సమయంలో పాములు కూడా ఒకదానికొకటి ప్రేరేపించుకుంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో ఆడ పాములోని హెమిక్లిటోరిస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పునరుత్పత్తి సమయంలో పాములు ఒకదానికొకటి మోహింపజేసుకుంటాయని ఈ పరిశోధనలో పాల్గొన్న ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త మోర్గాన్ ఫోల్వెల్ తెలిపారు. ఆడ పాము హెమిక్లిటోరిస్ ద్వారా మోహానికి గురవుతుందన్నారు. ఇది ఇతర జీవులలోనూ జరుగుతుంది. ఈ నూతన విషయాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ బీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Updated Date - 2022-12-15T12:13:34+05:30 IST