ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాములను పట్టేవారు చెప్పే ఆ విషయాల్లో నిజమెంత?.. ఈ సంగతులు తెలిస్తే షాకవుతారు!

ABN, First Publish Date - 2022-02-21T17:52:38+05:30

పాములకు సంబంధించిన ఏ విషయమైనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాములకు సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరంగా ఉంటుంది. పాముల గురించి ఏం చెప్పినా వినాలనిపిస్తుంది. పాములకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికర వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాముల కారణంగా ఏటా 1,38,000 మంది మరణిస్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి పాముల గురించి వింటున్నా.. మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. పాములను పట్టేవారు నాగస్వరం ఊదినప్పుడు ఆ పాము బుట్టలో నుంచి బయటకు వచ్చి.. బుసలు కొట్టడం ప్రారంభిస్తుంది. నాగస్వరం ద్వారా వారు పాములను తమ ఆధీనంలో ఉంచుకుంటారని అందరూ చెబుతుంటారు.  


అయితే అది నిజం కాదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును ఇది నిజం.. పాములకు చెవులు ఉండవు. కాబట్టి పాము వారు వినిపించే నాగస్వరాన్ని వినలేదు. అయితే పాములు నాగస్వరానికి ఎందుకు తలలు ఊపుతాయనే సందేహం మీలో వచ్చివుండవచ్చు. నాగస్వరం వినిపించే ఆ వాయిద్యాన్ని చూసిన పాములు దానికి భయపడతాయి. అవి తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని అవి భావిస్తాయట. ఈ కారణంగానే ఫాములు కదులుతుంటాయట. అవి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే అలాచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక పాము కోరలు తీయడమనే విషయానికొస్తే.. దీనిలో నిజం ఉందని తెలుస్తుంది. పాములను పట్టేవారు.. పాములను పట్టకున్నాక వాటి కోరలను తీసేస్తారని చెబుతుంటారు. ఇలా కోరలను తొలగించిన తర్వాత వాటి విషాన్ని విక్రయిస్తారు. ఈ విధంగా వారు పాములతో నిర్భయంగా మెలగుతూ, వాటిని ఆడిస్తుంటారు. 




Updated Date - 2022-02-21T17:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising